జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి : చెల్లూరు జనసేనపార్టీ ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ

     రాయవరం, (జనస్వరం) : జనసేన పార్టీ ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరoలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజకీయాలో తీసుకురావాల్సిన మార్పు కోసం, పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును యువతకు అందించడం కోసం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అవినీతి పాలనపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చే పిలుపు కోసం జనసైనికులు, వీరమహిళలు, పవన్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనసైనికులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

See also  ప్రజల కోసమే జనసేన కార్యక్రమం