జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గారి ఆధ్వర్యంలో 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరిక

జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గారి ఆధ్వర్యంలో 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరిక

        రాజకీయాల్లో యువత ఆవశ్యకత అవసరమని ముందుకు రాణించేలా కృషిచేయాలని యువతరం నవతరంతోనే మార్పు సాధ్యమని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ అన్నారు. మండలకేంద్రమైన ఎమ్మిగనూరు పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారంరోజు 50 మంది యువకులు జనసేనపార్టీలో చేరారు. ఈ సందర్బంగా రేఖగౌడ్ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేప్పట్టిన విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ పవన సభలు జరగడానికి కారణం యువకులే అని ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యువత ప్రాముఖ్యతను గుర్తించేలా పనిచేస్తారని అన్నారు. తిమ్మాపురం గ్రామంలో పార్టీలో చేరిన యువకులు పార్టీ బలోపేతం కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. జనసేనపార్టీలో చేరిన వారిలో యువకులు సురేంద్ర, వీరేష్, చంద్రన్న, వీరస్వామి, ఉరుకుందు, నరసింహ, వెంకటేశ్వర్లు, వీరితోపాటు జనసేనపార్టీ నాయకులు బజారి, అంప్పన్న, పాల్గొన్నారు. 

See also  అవుకు జనసేన నాయకులు ఆధ్వర్యంలో మన ఊరు - మన బడి కార్యక్రమం