అన్నదానాలకు ఆదర్శం డొక్కా సీతమ్మ గారు : ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ రేఖ

అన్నదానాలకు ఆదర్శం డొక్కా సీతమ్మ గారు : ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ రేఖ 

      జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు  పట్టణంలోని శ్రీ గురురాఘవేంద్ర అనాధ ఆశ్రమంలో ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రేఖగౌడ్ గారు మాట్లాడుతూ జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి అన్నదాన కార్యక్రమాలకు ఆదర్శం డొక్కాసీతమ్మ గారని అన్నారు. ఎవరు ఆకలి అని వచ్చినా పట్టేడన్నం పెట్టి ఆకలిని తీర్చిన గొప్ప మానవతావాది అపన్నుల  హస్తం అన్నపూర్ణ డొక్కాసీతమ్మ గారు వారి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో డొక్కాసీతమ్మ గారి ఆహార శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరో భవననిర్మాణ కార్మికులకు బాసటగా నిలిచామని గుర్తుచేశారు. సీతమ్మ పేరును తెలియని వారిని సైతం ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్రుల అన్నపూర్ణ నిత్యాన్నదాత ఉన్నారని రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు తెలిసేలా చేసిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. వారి జన్మదిన వేడుకల్లో భాగంగా అనాధ ఆశ్రమంలో అన్నదానం చేశామని డొక్కాసీతమ్మ గారి స్పూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేనాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పట్టణంలోని కోట స్ట్రీట్ లో కొలువైన పీర్ల దేవుళ్ళు దగ్గర మొక్కులు తీర్చుకున్నారు. కుల మతాలకు ప్రతీక మొహారం అని ఐక్యతను చాటే పండుగా శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు వెంకటేష్, రాహుల్ సాగర్, రవి, ప్రకాశ్, ప్రసాద్, పరాశరాం, ఉపేంద్ర, శబ్బీర్, మల్లికార్జున, కళ్యాణ్ పాల్గొన్నారు.

See also  ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం యొక్క మోసపూరిత, నిర్లక్ష్య వైఖరికి బలైన కార్మికులకి జనసేన నాయకుల అండ