
జనసేన పార్టీ ఈమని కిషోర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వరద ముంపు ప్రభావిత బాధితులకు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ద్వారా చేస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజున నిరుపేదలకు, వరదల వల్ల ఇబ్బంది పడిన వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వరద బాధితులకు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు అందివటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదల వల్ల వరద బాధిత జీవనం ఇబ్బంది పడ్డారని, భయంతో జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అధ్యక్షుల వారి జన్మదిన సందర్భంగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో వరద బాధితులకు తమ వంతుగా వారికి కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు అందివటం జరిగిందని ఆయన తెలిపారు. భాదితులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి ధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమంత్, తరుణ్, నాగా, త్రిశాంత్, శివ, పాషా తదితరులు పాల్గొన్నారు.









