
జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించిన జగ్గయ్యపేట జనసైనికులు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ద్వారా చేస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజున పట్టణములో స్థానిక చేపల మార్కెట్ వద్ద గల వృద్దాశ్రమంలో వృద్దులకు, అనాధాలకి మరియు యచకులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ అధ్యక్షుల వారి పిలుపు మేరకు, డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో పట్టణంలో పలు ప్రదేశాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అని, వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ సంవత్సరం ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, త్రిశాంత్, నాగ, తరుణ్, హేమంత్, పాషా, శివ తదితరులు పాల్గొన్నారు.









