
జనసేన పార్టీ ఆల్ నియోజకవర్గం టీమ్, కదిరి జనసేన ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందులో భాగంగా ఈరోజు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన పార్టీ ఆల్ నియోజకవర్గం టీమ్ సభ్యులు లక్ష్మణ్ అశోక్ ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి అతిథిగా పార్టీ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ హాజరయ్యారు. జనసేన పార్టీ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని దానిలో భాగంగా చెట్లు నాటడం,
రక్తదానం ఇలాంటి సేవా కార్యక్రమాలలో యువత పాలు పంచుకోవడం చాలా గర్వకారణం అని, దీనికి కారణమైన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు యువతను సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించిన ఘనత కూడా ఒక్క మెగా ఫ్యామిలీకి దక్కుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొని రక్తదానం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నిజాం, మహేష్, గంగాధర్, పవన్, మురళి, బాలాజీ, వినోద్ కుమార్, జహీర్, అబ్బాస్, ఫిరోజ్ భాష, సోము తదితరులు పాల్గొన్నారు.









