ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన సందర్భంగా జనసేన నాయకురాలు కాంతి శ్రీ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జనసైనికులు

ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన సందర్భంగా జనసేన నాయకురాలు కాంతి శ్రీ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జనసైనికులు

              జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా JSP ALL నియోజకవర్గం టీమ్ తలపెట్టిన గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం లో జనసేనపార్టీ నాయకురాలు కాంతి శ్రీ గారి ఆధ్వర్యంలో బలిజిపేట s.sపురం రాయనిపాలేం గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి తరం యువత, నేటి తరం యువతతో కలిసి కొన్ని మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంతి శ్రీ గారు మాట్లాడుతూ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా అధ్యక్షుల వారి పుట్టిన రోజులోపు నియోజకవర్గ వ్యాప్తముగా కొన్ని వందల మొక్కలు నాటటానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈరోజు రేపటి భవిష్యత్ అయినటువంటి యువత  సైతం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకి వచ్చి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టటం, ఆయన అడుగుజాడల్లో నడవటం శుభపరిణామం అని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో మొక్కలు నాటి అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవలసినదిగా కోరుచున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వీరమహిళ కాంతి శ్రీ  గారు మరియు శ్రీ కాకుళం జిల్లా అధ్యక్షులు చిరంజీవి యువసేన విశ్వక్ గారు రణస్ధలం మండలంలో కృష్ణాపురం గ్రామ MPTC అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, లావేరు MPTCఅభ్యర్థి దుర్గారావు బాలాజీ, రాజారాం MPTCఅభ్యర్థి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  సర్పంచ్ అవినీతిని బట్ట బయలు చేసిన పాటూరు గ్రామ జనసైనికులు