సేవలతోనే గుర్తింపు : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

జనసేన

    విజయనగరం ( జనస్వరం ) : సమాజంలో చేసే సేవలతోనే గుర్తింపు వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. స్థానిక 13వ డివిజన్ కు చెందిన యువనాయకుడు, జనసైనుకుడు సారిక విశ్వనాధ్జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో చేసిన సేవలను బట్టే గుర్తింపు లభిస్తుందని, తద్వారా ప్రజల గుండెల్లో మంచిస్థానం లభిస్తుందని అన్నారు. ప్రతీఒక్కరూ ఇలాంటి సేవలు అందించాలని కోరారు. అన్నదానం చేసిన విశ్వనాధ్ ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో భారీఎత్తున జనసేన నాయకులు, జనసైనుకులు,ఝాన్సీ వీరమహిళలు పాల్గొన్నారు.

See also  విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి