తణుకు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

    తణుకు, (జనస్వరం) : 73వ గణతంత్రదినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం తణుకు మండలం మండపాక గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు జాతీయజెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండపాక గ్రామ ప్రెసిడెంట్ జానా వెంకటలక్ష్మి  గ్రామ వార్డ్ మెంబెర్స్, మండపాక గ్రామ MPTC-2 సభ్యులు వేల్పూరి శ్రీనివాస్ మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ తణుకు మండలం పార్టీ ప్రెసిడెంట్ చిక్కాలవేను ఇరగవరం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆకేటి కాశీ, తెలగారెడ్డి లక్ష్మి, పంతం నానాజీ మరియు జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

See also  భాగంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జనసేనపార్టీలోకి చేరిక