నీట మునిగిన శనగ పంట… రైతులను ఆదుకోవాలని కోరుతున్ననెల్లూరు జనసేన నాయకులు

నీట మునిగిన శనగ పంట… రైతులను ఆదుకోవాలని కోరుతున్న నెల్లూరు జనసేన నాయకులు

         నెల్లూరు జిల్లా దగదర్తి మండలం మనుబోలు పాలెం గ్రామంలో నీట మునిగిన శనగ పంట అకాల వర్షాల కారణంగా మూడు వంతులు పంట నీట మునిగి ఎందుకు పనికిరాకుండా పోయింది. నీట మునిగిన పంటను రైతులకి బయటికి తీసి కూలీలు చెల్లించే దానికి కూడా కష్టంగా మారింది. మిగిలిన కొద్ది పంటను అమ్మ జూపగా దళారులు అడిగే ధరలు చూసి రైతులు గుండెలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆ మద్దతు ధర రైతులకు అందేటట్టు, నీట మునిగి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేటట్లు దళారులు నుండి వారిని కాపాడి, రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫునజనసేన నాయకుడు గునుకుల కిషోర్, తదితరులు కోరుతున్నారు. 

See also  సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపున ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు