Search
Close this search box.
Search
Close this search box.

మహిళా కమిషన్ కర్తవ్యాలే౦టి ???

mahilaa comission

       జాతీయ మహిళా కమిషన్ అనేది భారత ప్రభుత్వ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ. మహిళలకు సంబంధించిన, వారిని ప్రభావితం చేసే విషయాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలను ఆధారం చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం 31 జనవరి 1992 న ప్రారంభించారు. మహిళా కమిషన్ యొక్క లక్ష్యం దేశంలోని సమస్యలపై స్పందించటానికి జాతీయ మహిళా కమిషన్, రాష్ర్టాల పరిధిలో రాష్ట్ర స్థాయి మహిళా కమిషన్లు మహిళల హక్కుల గురించి ప్రాతినిధ్యం వహించడం వారి సమస్యలపై స్పందించి వారి గళం వినిపించటం ముఖ్య బాధ్యత. ప్రచారాలలో వరకట్నం, రాజకీయాలు, మతం, ఉద్యోగాలలో మహిళలకు సమాన హక్కులు, మహిళలను శ్రమ దోపిడీకి గురి చేయడం, మహిళలపై పోలీసుల వేధింపులపైనా, మహిళల సంక్షేమం కోసం పని చేయాలి.
              జాతీయ మహిళా కమిషన్ లో కానీ రాష్ట్ర స్థాయి మహిళా కమిషన్ లో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఒకరు చైర్మన్, ఒక కార్యదర్శి ఉంటారు. మహిళ కమిషన్ లో పదవులు నిర్వహించే చైర్ పర్సన్, సభ్యులకు మహిళా సమస్యలపై, న్యాయ స్థానానికి, కార్మిక సామర్థ్య నిర్వహణలో కానీ, మహిళా సాధికారికతపై కానీ పూర్తిగా అవగాహన ఉండాలి. కమిషన్ లో ఉండే ఐదుగురులో ఒకరు షెడ్యూల్డ్ కులాలకు, మరొకరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు తప్పనిసరిగా ఉండాలి. కేంద్రం పరిధిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం పరిధిలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు 3 సంవత్సరాల పదవీ కాలం వుండే విధంగా ఈ కమిషన్ సభ్యులను నియమిస్తారు. రాజ్యాంగ పరంగా మహిళా సంక్షేమ సంబంధిత అంశాలను సమీక్షించి, చేయవలసిన సవరణను సూచించడం. మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, మహిళల అభివృద్ధికి సంబంధించిన చట్టాలు అమలుకాని సందర్భంలో మహిళా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఈ కమిషన్ తనంత తానుగా (సుమోటో) జోక్యం చేసుకుని కేసును స్వీకరించి పరిష్కరిస్తుంది. మహిళల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలకు సంబంధించి సలహాలిస్తుంది.

         మహిళా లోక్ అదాలత్ లు నిర్వహించి బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయడం. వరకట్న నిషేధ చట్టం. వివాహ, ఆస్తి తగాదాల కేసులను పరిష్కరించడం. సెమినార్లు, వర్క్ షాప్ లను నిర్వహించి మహిళా సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించడం. రాజ్యాంగం, స్త్రీ సంబంధిత చట్టాల ప్రకారం మహిళలకు హామీ ఇచ్చిన నిబంధనలు, రక్షణకు సంబంధించిన ప్రతి విషయంలో కమిషన్ పర్యవేక్షించాలి. రాష్ట్రంలోని ఏజెన్సీ మహిళలపై రక్షణ చర్యలను, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేయడంలో ఏదైనా చట్టం విఫలమైతే సవరణల కోసం సిఫార్సులు చేయడం. మహిళా ఖైదీలు ఉన్న ఏదైనా ప్రాంగణాన్ని, జైలును, రిమాండ్ హోమ్‌ను, ఏదైనా కేసును తనిఖీ చేయడం, అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం. రాష్ట్రంలో అఘాయిత్యాలు మరియు వివక్షకు గురైన మహిళలకు కౌన్సెలింగ్ అందించటం, వారికి సహాయపడటం చేయాలి. 

            మహిళలకు ఎదుర్కొనే ప్రతి సమస్యలను పరిష్కరించటంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి అధ్యయనం చేస్తుంది. మహిళా హక్కులను పరిరక్షణ, సమానత్వం, సమ న్యాయం కోసం పని చేయాలి. సంక్షేమం అనే పదానికి దూరంగా ఉన్న ఏజెన్సీ మహిళల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తేవటంలో కమిషన్ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మహిళలకు సంబంధించిన హక్కుల పరిరక్షణ, సంక్షేమం ముఖ్య ధ్యేయంగా పని చేయాలి. సంబంధిత చట్టాలన ఉల్లంఘింన జరిగినప్పుడు, అవకాశాల తిరస్కరణ, మహిళలకు హక్కులను కాలరాసినప్పుడు జోక్యం చేసుకొని ద్వారా సంబంధిత సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయాలి. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. మహిళా ఆధారిత చట్టానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కమిషన్ పని చేయాల్సిన మహిళా కమిషన్ పదవులు కట్టబెట్టిన ప్రభుత్వానికి కొమ్ము కాయడం శోచనీయం. 

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు, మహిళల అభ్యున్నతికి, సాధికారత కొరకు పని చేయాల్సిన చట్టబద్ధమైన స్వయం ప్రతి పత్తి కలిగిన సంస్థ. నిష్పక్షపాతంగా వ్యవరించాల్సిన పాక్షిక న్యాయ సంస్థగా పని చేయాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way