పశ్చిమ బెంగాల్లో శుక్రవారం డెంగ్యూతో బాధపడుతున్న ఆరుగురు మరణించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 30 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న డెంగ్యు సంఖ్య ప్రభుత్వాన్ని వణికిస్తుంది. ఇప్పటికే కె ఎం సి కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ వారు మెడికల్ స్టాఫ్‌కి సెలవలు ఇచ్చేది లేదని చెప్పడంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా, బెంగాల్ ప్రభుత్వం డెంగ్యూ కేసుల వివరాలను కేంద్రంతో తన వెక్టర్-బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కోసం పంపడం లేదని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆరోపించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com