Search
Close this search box.
Search
Close this search box.

ఏపీలో మద్యపాన నిషేధం అటకెక్కినట్లే ???

మద్యపాన నిషేధం

          దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల వాగ్దానం. కానీ, దశల వారీగా నిషేధాన్ని తగ్గిస్తూ సామాన్యులకు మద్యం చేరువ చేస్తున్నదిఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆదాయ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు ఇక్కడ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి, మద్య పాన నిషేధం ఉండదు అని హామీ ఇచ్చి మరీ విజయవంతంగా అప్పు తెచ్చుకున్న ఘనత ఈ ప్రభుత్వానిది.

            గత టిడిపి ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇలాంటి విధానం ద్వారా బాండ్ల అమ్మకాలు చేపట్టారు. అప్పుడు 2000 కోట్ల రూపాయల అప్పులు రాబట్టింది. ప్రభుత్వం ఏదైనా ఒక సంస్థ ద్వారానే అప్పులు పొందగలరు. ఆ సంస్థ మధ్యవర్తిగా ఉండాలంటే ఫీజు చెల్లించాలి, GST చెల్లించాలి అది కూడా కోట్ల రూపాయల్లో కమీషన్ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయాన్ని, ఉద్యోగుల సొమ్మును ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ కు మళ్లించి అధిక వడ్డీకి 8300 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. 2000 వేల కోట్లు అప్పు దొరుకుతుంది అనుకుంటే 8300 కోట్లు అప్పు సంపాదించి పెట్టాయి. 15 సంవత్సరాల వరకు మద్యం బాండ్లను నిషేధిస్తే తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలి అనే షరతు ఒప్పుకొని మద్య విధానం మార్చమనే హామీతో అప్పు దొరికింది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ఈ మద్య విధానం మార్చడం కుదరదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తోంది. ముందు ఏపీ బేవరేజస్ సంస్థ మార్జిన్ పెంచుకొనేలా చట్ట సవరణ చేసింది, ఇప్పుడు ఆ మార్జిన్ గా వసూలు అయిన మొత్తాన్ని ఆదాయంగా చూపించారు. నిజానికి కార్పోరేషన్ కి నిర్వహణ చార్జీలు మాత్రమే ఇస్తారు. నిర్వహణ ఛార్జీలుగా వచ్చిన ఆదాయం కూడా ఆడిట్ జరిగిన తర్వాత కార్పొరేషన్ కు చెల్లించాలి. వ్యాట్ ని తగ్గించుకొని ఒక సంస్థకు ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చుకోవటం పైగా రెండు, మూడు సంస్థల నిధులను సమీకరించి ఉద్యోగుల భవిష్య నిధి నుండి 500 కోట్లు సమీకరించారు. ఓ వైపు ఉద్యోగులకు 2200 కోట్లు ఈపీఎ్‌ఫవో బకాయిలు, ఇతర పెండింగ్‌ నిధులు చెల్లించాలి. వాటిని చెల్లించలేదు పైగా వాళ్లు తమ జీతాలతో కోత పెట్టుకొని నెలనెలా దాచుకునే పీఎఫ్‌ సొమ్మును తెచ్చి లిక్కర్‌ బాండ్లలో పెట్టి అప్పులు తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు.
                  విడతల వారీగా నిషేధాన్ని ఎత్తి వేస్తున్నారు. మాట ఇచ్చినంత సులువుగా నిలుపుకోలేక పోతున్నది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టగానే కొత్త మద్యం పాలసీ అని మద్యం షాపులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. నామ మాత్రంగా షాపుల సంఖ్య తగ్గించి, మద్యం కొనాలంటే భయపడాలి అని మాయ మాటలు చెప్పి మద్యం ధరలు పెంచింది గత రెండు సంవత్సరాలుగా ఒక్క మద్యం షాపును తగ్గించింది లేదు. ఎప్పుడూ వినని పేర్లతో కొత్త నాసి రకం బ్రాండ్లన్నీ అమ్మటం మొదలు పెట్టారు. నాసిరకం మద్యం దొరుకుతుండటం వల్ల చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా జరగటం, ఓ వైపు నాటు సారా తయారీ అధికం అవ్వటం ఎంత నియంత్రణ చేపట్టినా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
                    2018-19 ఆర్ధిక సంవత్సరం లో మద్యం పై వచ్చిన ఆదాయం 14,500 కోట్లు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి మద్యంపై ఆదాయం 19,500 కోట్లు రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చి పెట్టే మద్యం అమ్మకాలు చేస్తూ ప్రజల జీవితాలను పణంగా పెట్టి సంక్షేమ పథకాలకు ప్రాణం పోస్తున్నారు. మద్యపాన నిషేధం కాస్తా మద్య పాన నియంత్రణ అయ్యింది ఇప్పుడు నియంత్రణ మాట ఏమో కానీ యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతాయి. ఒకప్పుడు ప్రభుత్వ హామీతో బాండ్ల పై అప్పులు తేవడం తప్పు అని ప్రశ్నించి ఇప్పుడు అదే తప్పు నిస్సిగ్గుగా చేసి అధిక వడ్డీకి అప్పులు చేసి గొప్పగా చెప్పుకోవడం అడ్డదారులు వెతికి మరీ పరిమితికి మించి అప్పులు తెస్తున్న ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరం చేసిన అప్పుల లెక్కలు కేంద్ర ఆర్థిక వ్యయ నియంత్రణ విభాగం (CAG) కోరినా అందించలేదు. 2022 -2023 ఆర్ధిక సంవత్సరం 28 వేల కోట్ల రూపాయల రుణ పరిమితికి మాత్రమే అనుమతి ఉంది. పరిమితులు దాటి భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరో ఘనత సొంతం చేసుకొని ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేస్తున్న ప్రభుత్వం మేలుకొని విధానాలు మార్చుకోవాలి. 

– టీం నారీశ్వరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way