Search
Close this search box.
Search
Close this search box.

నూతన విద్యా విధానం – ప్రాథమిక విద్య దూ(భా)రం

విద్య

“విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే” అని భర్తృహరి సుభాషితం.

          బోధన, అభ్యాసం ద్వారా నైపుణ్యాలను వెలికి తీస్తూ పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని అందించటమే విద్య అలాంటి విలువైన విద్యను 6 నుండి 14 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నిర్బంధంగా అందించాలనే రాజ్యాంగం ఇచ్చిన విద్యా హక్కుచట్టం చేసి ఎన్నో లక్షల మంది చిన్నారుల భవిష్యత్తుకు జీవం పోస్తూ దేశ ప్రగతికి పునాదులు వేస్తున్నారు. అయినా లక్షల మంది నిరక్షరాస్యులుగానే మిగిలి పోతున్నారు. మాతృభాషలకు ప్రాధాన్యం ఇస్తూ అందరికీ, అందుబాటులో విద్యను అందించుటకు 34 సంవత్సరాల తర్వాత రూపుదిద్దుకున్న జాతీయ విద్యా విధానం ఆధారం చేసుకొని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానం జి.వో 117 ద్వారా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ (Rationalisation) అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం విద్యార్థులను, విద్యార్థుల తల్లితండ్రులను, పాఠాలు భోదించే ఉపాధ్యాయులను సైతం అయోమయానికి గురిచేస్తున్నాయి.
               జాతీయ విద్యా విధానంలో పూర్వ ప్రాథ‌మిక విద్య‌ (Pre Primary Education) పై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవ‌త్స‌రాల విద్యా విధానంగా ఇ 3-8, 8-11, 11-14, 14-18 సంవ‌త్స‌రాల విద్యార్ధులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కానీ మన రాష్ట్రంలో
1. ఫౌండేషన్ స్కూల్స్:- ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2, ప్రిపరేటరీ ఫస్ట్ క్లాస్, 1వ, 2వ తరగతితో ఉంటాయి. SGT ఒక్కరు మాత్రమే ఉంటారు. ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఈ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న UPS లేదా high school గా విభజించారు.
2. మిడిల్ స్కూళ్లు (6–8 తరగతులు), 150 మందిని మించి విద్యార్థుల సంఖ్య ఉంటే ఉన్నత పాఠశాలగా పరిగణిస్తారు ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండి ఇప్పటికే ఆ పోస్టు ఉంటే దాన్ని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల్లో కలిపి హేతుబద్ధీకరణగా లెక్కిస్తారు. 5 కి.మీ పరిధిలో సెకండరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు గా పరిగణిస్తారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న విభాగాన్ని మూసేస్తారు. అక్కడి మిగులు ఉపాధ్యాయులను మరో పాఠశాలకు బదిలీ చేస్తారు
3. సెకండరీ స్కూళ్లు : (9నుంచి 12 తరగతులు) గా విభజించారు. ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్ ద్వారా గుర్తించి ఇంటికి దగ్గరగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు. 1 కి. మీ పరిధిలో ఫౌండేషన్ స్కూలు, 3 కి. మీ పరిధిలో సెకండరీ స్కూలు ఉండాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండాలి.
         నూతన విద్యా విధానంలో పాఠశాల వ్యవస్థను నాశనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జివో లను సూచిస్తూ పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జారీ చేసిన జీవో నందు 1 నుంచి 8 తరగతి వరకు ఒకే మాధ్యమంలో విద్యా బోధన ఉంటుందని జీవోలో తెలిపినా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు హైకోర్టు తీర్పుని ఉల్లంఘిస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ. ఈ పాఠశాలల విలీనం వలన చదువు మానేసే వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. నూతన విద్యా విధానం ముసుగులో ఉపాధ్యాయుల, పాఠశాలల సంఖ్యను తగ్గించాలన్నదే ప్రభుత్వ పరోక్ష ఉద్దేశ్యం. ఇది ఇలాగే కొనసాగితే DSC కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ఉండదు. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడవేస్తూ విలీనం చేయాలి అనుకోవటం తప్పు విద్యా వ్యవస్థలోచేస్తున్న మార్పుల వల్ల ప్రయాణించే దూరం పెరగటం, ముఖ్యంగా ఆడపిల్లలను దూరం పంపటం ఇష్టపడని తల్లిదండ్రులు సౌకర్యంగా లేకపోతే చదువు మధ్యలో ఆపివేసే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు విలీనం పేరుతో మూసివేయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రాథమిక విద్య హక్కు ప్రమాదంలో పడింది. 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంది. సంస్కరణలు అవసరమే కానీ సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి, విద్యను అందించే క్రమంలోవిద్యార్థులు విద్యకు దూరం కాకూడదు ప్రాధమిక విద్య చదువుకొనే పిల్లలు హై స్కూల్ లో చేరటం వల్ల ఒక్కొక్కటిగా చదువుతూ ఉత్తీర్ణత సాధించవలసిన విధానం మారిపోయి విజ్ఞానం అందదు, వికాసం జరగదు. 

– టీం నారీస్వరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way