Search
Close this search box.
Search
Close this search box.

జనవరి జాబ్(లెస్) క్యాలెండర్ ???

క్యాలెండర్

     అన్న వస్తున్నాడు – మంచి రోజులు వస్తున్నాయి అన్నారు…

         అధికారంలోకి వస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అని నినదించి అధికారంలోకి వచ్చాక 3 జాబ్ క్యాలెండర్ల కాలంలో ఒక్క జాబు ఇవ్వలేదు. చెప్పిన మాట ప్రకారం ప్రతి ఏటా జనవరి నెల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారేమో అని నిరుద్యోగుల దీర్ఘ కాల నిరీక్షణకు తెర దించుతూ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత 2021 జూన్ లో “జగనన్న ఉద్యోగ విప్లవం” అంటూ జాబ్ లెస్ క్యాలెండర్ ను విడుదల చేశారు. లక్షల మంది సమర్థులైన నిరుద్యోగ యువత తమ ప్రతిభతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తుంటే 36 పోస్టులు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తమ ఖాతాలో వేసుకుని, 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని, కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటనలు గుప్పించారు. గౌరవ వేతన గ్రామ వాలంటీర్ లను కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కలిపేసుకొని కల్పితపు ఉద్యోగాలను మసిపూసి మారేడు కాయ చేసినట్టు లెక్క చెపుతున్నారు. రాష్ట్రంలోని ప్రతిభా వంతులైన నిరుద్యోగ యువతను మోసం చేశారు..

         అమ్మ ఒడి, నాడు నేడు వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులను మాత్రం నియమించలేదు. 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ఏటా మెగా డీఎస్సీ దాని ఊసే ఎత్తడం లేదు. ముక్కుతూ, మూలుగుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటికీ ఉచితాల ఉచ్చులో పడే యువత కాదు ఉన్నత చదువులు చదివి పరీక్షలు రాసి తమ ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఎదురుచూస్తున్న లక్షలాది యువత అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ఊహకు అందని 36 పోస్టులు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు, అటు ప్రభుత్వం గానీ ఇటు నిరుద్యోగులు కానీ తేల్చుకోలేని స్థితిలో ఉండాల్సి వచ్చింది. లక్షల ఉద్యోగాల పేరుతో ఓట్లు దండుకొని బూటకపు మాటలలో నిరుద్యోగ యువతను మోసం చేసారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలపై అక్రమ అరెస్టులు చేసిన నిరంకుశ పాలనతో యువత విసిగిపోయారు.

          కుటుంబానికి దూరంగా, ఆర్ధికంగా భారంగా ఉన్నా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న ఎంతో మంది నిరుద్యోగులను జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. జనవరి వస్తుంది, పోతుంది కానీ జాబ్ క్యాలెండర్ జాడ ఉండట్లేదు. నిరుద్యోగులు తమ కష్టాల కడలిని మాత్రం దాటలేక పోతున్నారు ఎన్నికలప్పుడు అన్న వస్తే యువతకు జాబ్ ఇస్తా అని ఇప్పుడు అధికారం వచ్చాక రాజకీయ నిరుద్యోగులకు రాత్రికి రాత్రి జీవో లు ఇచ్చుకుంటూ సలహాదారులుగా ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలకోసం లక్షల మంది సమర్థులైన నిరుద్యోగ యువత తమ ప్రయత్నాలు చేస్తుంటే మాట ఇచ్చి మరిచి మడిమ తిప్పుతూ పస లేని ప్రకటనలు చేస్తున్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేస్తున్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమైపోయింది? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు చేస్తారు?

         ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు, ప్రకటించిన 11వ పి ఆర్ సి 23.29% ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలకు తీవ్ర నిరాశ కలిగించాయి. 1-7-2018 నాటికే 54% ఫిట్ మెంట్ ఇవ్వవలసి ఉండగా 1-4-20 నుండి మానిటర్ బెనిఫిట్ మాత్రమే ప్రకటించారు, CPS ప్రస్తావన లేదు, HRA, DA పై ఎలాంటి వివరణ లేదు. ఓవైపు రిటైర్మెంట్ 2 సంవత్సరాలు పెంచుతూ చేసిన ప్రకటన నిరుద్యోగుల ఆశలను నిలువునా ముంచేసినట్లయింది. అభివృద్ధి కోసం అంటూ అప్పులు చేస్తూ, ఆదాయం కోసం ప్రజల అస్తులను తాకట్టు పెడుతున్నారు. ప్రతిభావంతులైన భావి యువతరం పట్ల నిర్లక్ష్యం తప్ప యువత పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, యువత దారి తప్పితే భారీ మూల్యం భావి తరాలకే.

Writteny By 

– కృప, జ్యోతి, రేణు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

క్యాలెండర్
మెగా ఫాన్స్ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way