ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలకులు ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ పని తీరులో లోపాలను సవరించుకుంటూ, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. సాధారణ ప్రజలతో మమేకమై ప్రజల మనసుల్లో స్థిరమైన స్థాయిని ఏర్పరచుకొని చిర స్థాయిగా నిలిచేలా ప్రజలను పాలించాలి. ఏ వ్యవస్థలో అయినా లోపాలు లేకుండా ఉండవు. కానీ ఆ లోపాలను, సమస్యలను ఎప్పటికప్పుడు సరి చేసుకునేందుకు గతంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసి సమస్యలను నేరుగా ప్రజల నుండి తెలుసుకొనే వారు .
ప్రజల నుంచి నిత్యం వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం గతంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వాల హయాంలో పేర్లు ఏవైనా ప్రజా సమస్యల పరిష్కారానికి ఏదో ఒక వేదిక ఉండేది. అత్యధిక మెజారిటీతో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా కొంత కాలం ప్రజా దర్బార్, స్పందన పేరుతో ప్రతి రోజూ అరగంట పాటు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు తీసుకుని, వాటికి పరిష్కారం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉండేది, రాను రాను వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్ధాయిలో పట్టించుకొనే నాధులు కరువైనారు. ఏవేవో కారణాలతో స్పందన పట్ల స్పందన కరువయింది. సంక్షేమ పథకాల అమలు పేరిట అధికార యంత్రాంగం అప్పులు తేవటంలో, తెచ్చిన అప్పులు ఖాతాల్లో వేస్తూ పంచటంలో నిమగ్నమై ఉన్న సమస్యలను, వినతులను గాలికి వదిలేసారు. ఓ పక్క ఖజానా ఖాళీ అయి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాలా తీసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పించన్లు కానీ మొదటి తారీకున అందించాలంటే అగమ్యగోచరంగా ఉంది.
రాని ఉచిత పథకాలు కోసం, చేయని అభివృద్ది కార్యకమాల కోసం వచ్చే ఫిర్యాదులు అంతంత మాత్రంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ వల్ల జవాబు చెప్పలేని పరిస్థితి. జవాబు దొరకక, సమస్యను పట్టించుకోరని తెలుసుకున్న జనం స్పందన లేని స్పందన కార్యక్రమాన్ని విడిచి పెట్టేశారు. పైగా ఏ ఫిర్యాదులకైనా అధికారులు స్పందించక పోవటంతో ప్రజల్లో నిర్లిపత పెరిగి ఫిర్యాదుల చేయటమే తగ్గించారు. దాన్ని కూడా ప్రభుత్వ పని తీరు బాగుంది కాబట్టే వినతులు రావట్లేదు అని చెప్పడం హాస్యాస్పదం. గతంలో స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధికారులకు డెడ్ లైన్లు పెట్టేది. స్వయంగా సీఎం జగన్ సోమవారం వచ్చే పిర్యాదులపై మంగళవారం స్పందించేవారు. ఒకే అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. కానీ ఎప్పుడైతే ఫిర్యాదుల పరిష్కారం కావడం లేదో అప్పుడు క్షేత్రస్ధాయిలో ఫిర్యాదుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రభుత్వంలో ప్రభుత్వంపై ఎలాంటి ఫిర్యాదులు లేవనే ధోరణిలో ఉండిపోతున్నారు.
సామాన్యులు సమస్యలపై ప్రశ్నించటం మర్చిపోయినట్లే అయింది. జనం సమస్యల కోసం బలమైన గళంగా జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా చేపట్ట నున్నారు. బలహీనమైన జనం గొంతుకు బలంగా, సమస్యల పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం 5 వారాల పాటు నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల కోసం, ప్రజల కొరకు స్పందన కరువైన వినతుల వెల్లువకు స్పందన తెచ్చేలా జనసేన పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. జనం నిరంతరం ఎన్నో సమస్యలు ఎదురు అవుతున్నా పరిష్కారం దొరకదు అనే స్థాయిలో ఉండి పోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజానీకం నుండి వినతులు స్వీకరిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల వైఫల్యం అడుగడునా జనానికి అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని సామాన్యుల తరుపున పార్టీ ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి పరిష్కారం అందించేందుకు కృషి చేస్తారు. జనం కొరకు గళంగా, బలహీనుల కొరకు బలంగా, పరిష్కారానికి మార్గంగా ఈ కార్యక్రమం నిర్వహణ అనితర సాధ్యం.