రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో పేదల ఇళ్ళ స్థలాలు ఇచ్చి వెనక్కి తీసుకుంటున్న వైసీపీ పార్టీ. వాలంటీర్లు, అధికారులు ప్రజలను ఇల్లు కట్టుకోకపోతే స్థలం తీసేసుకుంటాం అని బెదిరింపులు చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే జనసేన పార్టీ ఎంపీటీసీ సాక్షి శివకృష్ణ, ఏరుపల్లి జనసైనికులు స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు అధికారం ఇచ్చింది పేద ప్రజలకు న్యాయం చేయాలని రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో జనసేన పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏరుపల్లి గ్రామంలో ఈ ప్రభుత్వం కొంతమందికి పట్టాలు ఇచ్చింది కానీ అక్కడ వారికి ఏవిధమైన స్థలాన్ని చూపించకపోవడంతో ఉట్రుమిల్లి గ్రామానికి వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుని జనసేన పార్టీ MPTC సాక్షి శివక్రిష్ణ కుమార్ ప్రశ్నించగా మంత్రి నుండి సరైన స్పందన లేదు. ఆయన సరిగ్గా స్పందించి ఏమి చెప్పలేదు. మాకే సమాధానం చెప్పకపోతే సాధారణ పౌరుడికి ఇంక ఏమీ సమాధానం చెబుతారని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు బుంగారాజు సంపత్, కాజులూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న, గంగవరం మండలం అధ్యక్షులు చిర్రారాజ్ కుమార్, ఏరుపల్లి గ్రామ అధ్యక్షులు జడ్డు సతీష్, జనసేన పార్టీ MPTC లు, చిక్కాల స్వామి, మంచెందేవి, జనసేన నాయకులు కణితి రాంబాబు, రాంబాబు నాయుడు, చవ్వాకుల సతీష్ తదితర ఏరుపల్లి గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.