For the people, Of the people, By the people ఇది ప్రజాస్వామ్య విధానం. ప్రజా స్వామ్యంలో ప్రజల కోసం ఏదైనా చేయాలి అంటే ప్రజా క్షేత్రంలో ఎన్నికల బరిలో నిలబడి గెలిచి అధికారం చేపడితే ఒక యంత్రాంగం ద్వారా గెలిపించిన ప్రజల కోసం, ప్రజా ధనాన్ని వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తే ఆ ప్రభుత్వం నడుపుతున్న రాజకీయ పార్టీలకు పేరు, ప్రఖ్యాతులు దక్కుతాయి. ఇది సాధారణంగా జరిగే విషయం అందుకు భిన్నంగా ఒక రాజకీయ పార్టీ అదీ ఓటమి వరించిన పార్టీ అధినేత లాభాపేక్షతోనో, అధికార కాంక్షతోనో రాజకీయ ప్రవేశం చేసి ఉంటే అధికారం అందలేదని ప్రజలకు అందనంత దూరంలో ఉండే వాళ్లు. మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చి శుష్క వాగ్దానాలు చేసి డబ్బు ఏరులుగా పారించి గెలుద్దాం అనుకొనేవాళ్లు, ప్రభుత్వ వైఫల్యాలను చూస్తూ కూడా కాంట్రాక్టులు వస్తాయనో, కావలసినవి సాధించుకోవచ్చని పైకి జనం చూడగా విమర్శిస్తూ లోపల స్నేహ హస్తం అందిస్తూ స్వప్రయోజనాల కోసం సాగుతుంటాయి. ఓడిన పార్టీల ప్రస్థానాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది చెప్పు కొనేంత గర్వకారణం అక్రమార్జనల పర్వం సర్వం దౌర్జన్యం దోపిడీల మయం, నోట్ల గుమ్మరింపులు, ఓట్ల బడలాయింపులు, పార్టీ ఫిరాయింపులు కానీ చరిత్రలో ఎవరూ చేసేందుకు కూడా సాహసించని విధంగా కొత్త తరం రాజకీయం అని అన్నట్లు గానే ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే సువర్ణాక్షరాలతో లిఖించగలిగే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుంది ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలు అవుతుందని సంకల్పం పట్టిన సాయుధుడై కదిలాడు. కొత్తతరం రాజకీయ సేద్యం చేస్తున్న కర్షకుడిగా వ్యవసాయం చేస్తూ అప్పుల బారిన పడి ఆర్ధిక ఇబ్బందుల వల్ల బలవన్మరణాల బారిన పడిన కౌలు రైతులకు సాయం అందించే ధైర్యం తానే అడుగులు వేసాడు. తన స్వార్జితంతో అండగా నిలవాలని, అలసిన కుటుంబాలకు ఆదరణ అందించే అన్నగా “కౌలు రైతుల భరోసా యాత్ర” మొదలు పెట్టాడు. అధికారం, అడ్డదారుల్లో ఆర్జన, అక్రమాలు, ఆశ్రిత జన పక్షపాతం, అణిచివేతలు పరమావధిగా కొనసాగే రాజకీయ ముఖచిత్రం మార్చేందుకు తన పంథాలో నడక మొదలుపెట్టారు. వ్యక్తిగా సమాజం పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల అవసరం ఉన్న ప్రతిసారి బాధ్యతగా స్పందించి ఆర్ధిక సహాయం కోట్ల రూపాయలు తృణ ప్రాయంగా విరాళాలుగా అందించే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యల పట్ల మరింత బాధ్యతతో పార్టీ తరుపున సాయం అందించాలని మొదట 5 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఆర్ధిక అందించి భరోసా కల్పించాలని అనంతపురం జిల్లా నుండి మొదటి ప్రయత్నంగా 30 కుటుంబాలకు అందించారు. ఇది గెలిచి అధికారం అందుకొని పరిపాలిస్తున్న ప్రభుత్వం చేయాల్సిన పని, పాలకుల వైఫల్యం కారణంగా ప్రతి పక్షంగా నిలబడి ప్రశ్నిస్తూనే పార్టీ తరుపున కౌలు రైతుల కుటుంబాల కన్నీరు తుడిచి పార్టీ తరుపున సాయం అందించి మొద్దు నిద్దుర పోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పారు. కౌలు రైతుల గోస వినిపించని గుడ్డి చెవిటి ప్రభుత్వానికి కనపడేలా వినపడేలా చేసి ప్రభుత్వం తరపున పరిహారం కూడా అందేలా పోరాటం చేస్తున్నారు. 3 ఏండ్ల లో 3 వేల మంది పైగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వబోతున్నాము అని ఒక పార్టీ అధినేత ప్రకటించటం అనుపమానం. ఈ నిస్వార్థ ప్రయత్నం ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆసరా నింపే భరోసా నింపుతూ విజయవంతం అవ్వాలి. మరణించిన కౌలు రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి. ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం “జనం కోసమే జనసేన”.
– టీం నారీస్వరం