Search
Close this search box.
Search
Close this search box.

జగనన్న ఇల్లు -పేదలకు కన్నీళ్లు #JaganannaMosam

జగనన్న ఇల్లు

           ఆహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, గృహం ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అవసరాలు, కనీస మౌలిక సదుపాయాలు. అన్ని అవసరాలు తమ ఆర్ధిక స్థోమతను బట్టి తీర్చుకునే ప్రతి పేద వాడి కల సొంత ఇల్లు. ఆ సొంత ఇంటి కల తీరటానికి ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందుతుంది అంటే తమ కల నెరవేర్చుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అదే ప్రభుత్వం ఎన్నికల హామీలలో “నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు” ఆ కార్యక్రమంలో భాగంగా 25 లక్షలమందికి ఉచితంగా ఇల్లు కట్టిస్తామంటే సామాన్యులు ఆశ పడకుండా ఉంటారా ఇస్తామంటే ఆశ – కొడతారంటే భయం ఉండటం సహజం.
           ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 ఏళ్లకు తొలిదశ గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టినా చాలా చోట్ల ఇంటి ఆకారం కూడా పూర్తిగా రూపు దిద్దుకోలేదు. కేటాయించిన వాటిలో 10 శాతం కూడా పూర్తి చేయలేదు. “ఏ వంక అంటే వేలు వంక’ అని కొన్నాళ్లు కోవిడ్ పేరిట నెట్టుకొచ్చారు. ఇక స్థల నిర్ణయం, ఇళ్ల నిర్మాణం పరిస్థితి చూస్తే నిలువెత్తు నిర్లక్ష్యం సాక్షాత్కారిస్తుంది. ఉచితంగా ఇస్తున్నాం అని మొక్కుబడిగా లోతట్టు ప్రాంతాలలో, ఊరికి దూరంగా దారి, విద్యుత్తు, రవాణా వంటి సరైన సౌకర్యాలు కూడా లేని ప్రాంతాల్లో స్థలాలను కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో 50 గజాలు, గ్రామీణ ప్రాంతాల్లో72 గజాలు స్థలాలు ఇచ్చారు. 
ఇళ్ల నిర్మాణానికి 3 రకాల పద్ధతులను సూచించింది
1. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడం,
2. లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి అందించడం
3. ప్రభుత్వం పూర్తిగా ఇంటిని నిర్మించి ఇవ్వడం

        ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం రూ.1.80 లక్షలు. కనీస సౌకర్యాలతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే దానికి కనీసం రెట్టింపు ఖర్చు అవుతుంది. ఇల్లు కట్టుకునే నిర్మాణ సామగ్రి, ఇనుము, సిమెంట్ బస్తాలు, ఇసుక, కూలీ రేట్లు విపరీతంగా పెరిగి సామాన్యులకు భారంగా మారిపోయాయి కాబట్టి ఎక్కువగా 3 ఆప్షన్ ని ప్రజలు కోరుకున్నారు. గతంలోని యూనిట్ ధర కంటే తక్కువగా నిర్ణయించి ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు కేటాయిస్తారు. ఈ పథకాలకు గాను UrbanLevelBodies కింద పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటికి కేంద్ర ప్రభుత్వం పిఎంఎవై అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద రూ.1.50 లక్షలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 వేల రూపాయలు. గ్రామీణ ప్రాంతాల్లో Urban Development Authorities కింద ఇల్లు కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాటా రూ.30 వేలు ఇస్తారు. గత ప్రభుత్వం పిఎంఎవై అర్బన్‌-ఎన్‌టిఆర్‌ పధకంలో ఇల్లు నిర్మాణానికి పట్టణ పేదలు ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.లక్ష కలిపి రూ.2.50 లక్షలు ఇచ్చేవారు. ఇతరులకు కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.50 వేలు కలిపి రూ.2 లక్షలు ఇచ్చేవారు. గ్రామీణ ప్రాంతాల్లో కట్టుకునే ఇంటికి కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద రూ.50 వేలు కలిపి రూ.2 లక్షలు ఇచ్చేవారు. కేంద్రం వాటా లేకుండా నిర్మించే ఎన్‌టిఆర్‌ ఇళ్లకు మాత్రం రూ.1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించేవారు. వైసిపి ప్రభుత్వం మాత్రం అన్ని వర్గాల ప్రజలకు ఒకే రకంగా రూ.1.80 లక్షల యూనిట్‌ విలువగా నిర్ణయించటం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రూ.70 వేలు, ఇతరులకు రూ.20 వేలు అందకుండా చేశారు. ఎన్నికల హామీ ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు ఇస్తామని చెప్పి మాట తప్పింది.
         చెప్పాము కాబట్టి చేయక తప్పదు అనే ధోరణి లో జగనన్న కాలనీలు మొదలు పెట్టిన ప్రభుత్వం 10% కూడా పూర్తి చేయలేక చేతులు ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా విడుదల చేయకపోవడం వలన రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి పెద్ద అడ్డంకి. ప్రభుత్వం దాస్తున్న వాస్తవం. ఇళ్ళు ఉచితంగా కట్టిస్తామని చెప్పి విడతల వారీగా స్థలాలు ఇవ్వడం, 3 రకాల ఆప్షన్స్ ఇచ్చి, నిబంధనలు పెట్టడం, నిర్మాణం చేపట్టకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని ప్రజలపై వత్తిడి తేవడం వైసిపి ప్రభుత్వం యొక్క లోపభూయిష్టమైన విధానాలు చిత్తశుద్ధి లేని పథకాల అమలుకు అద్దం పడుతుంది. స్థల సేకరణ, కేటాయింపు, విధానాలు, ఇసుక కూపన్లు, సిమెంట్ బస్తాలు పంపిణీ నిధులు కేటాయింపు ప్రతి దశలో వివాదాలు ఎక్కువ చోటు చేసున్న పధకం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way