Search
Close this search box.
Search
Close this search box.

రాజు మారితే రాజధాని మారాలా ??

       పరాయి పాలనను ధిక్కరించి స్వాతంత్ర్యం కోసం పోరాడాం, సాధించుకున్నాం. కానీ వాళ్ళు పాటించిన “విభజించు – పాలించు” సూత్రాన్ని నేటి మన స్వదేశీ నాయకులు ఏ మాత్రం మర్చిపోవట్లేదు. చిన్న ప్రాంతాలతోనే అభివృద్ధి సాధ్యం అని నినాదాన్ని రాజకీయ లబ్దికి ఎరగా వేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటుంన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం ప్రతిపక్ష నేతగా, అసెంబ్లీ సాక్షిగా అమరావతినే రాజధానిగా నాడు ఆమోదం తెలిపిన నేటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నాడు ఇచ్చిన మాట తప్పి, మడిమ తిప్పి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అంటూ పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా అమరావతి కేవలం శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా 3 రాజధానులు అంటూ ప్రకటించి కొత్త వివాదానికి తెర లేపారు.
     స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం ఆంధ్రప్రదేశ్ నిరంతరం ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య “రాజధాని”. కర్నూల్ నుండి రాజధాని మారినప్పుడు, మద్రాసు నుండి విడిపోయినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అమరావతి రాజధానిగా నిర్ణయించుకొని నేడు 3 రాజధానుల ప్రస్తావన వరకు ప్రతీసారి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
      అభివృద్ధి కోసం వికేంద్రీకరణ అని చెప్తున్న ప్రభుత్వం న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై ఎలాంటి న్యాయపరమైన చర్యలకు పూనుకోలేదు. ఇటు మొదలు పెట్టిన 3 రాజధానుల విషయాన్ని విడిచి పెట్టలేదు. న్యాయస్థానం ఇచ్చిన మాండమస్ ని దాటి వెళ్లగలరా? ప్రజల ముందు అభివృద్ధికి మూడు రాజధానులు అంటూ చేస్తున్న విన్యాసం సాధ్యం అయ్యేనా?  3 రాజధానుల కోసం ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ గర్జన అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతూ, ప్రాంతీయ విభేదాల ద్వారా రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచన కనిపిస్తుంది. అమరావతి కోసం పంట భూములు ఇచ్చి బజారున పడిన రైతులను దూషిస్తూ, ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై వైసిపి నాయకులు, మంత్రులు వ్యక్తిగత దూషణలు చేస్తూ మాట్లాడటం అభ్యంతరకరం. మాటలు అదుపు తప్పి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కార్యనిర్వాహక రాజధాని ద్వారానే ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదం ప్రజల ఉద్వేగాలను రెచ్చకొడుతున్నారు. నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టి, రాజకీయాలకు అతీతంగా.. శాంతియుతంగా విశాఖ గర్జన చేస్తామని ప్రకటించిన జేఏసీ చేపట్టిన విశాఖ గర్జనకు మద్దతు ప్రకటిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అవటంతో రాజకీయ రంగు పులుముకుంది.
       జిల్లాల పునర్విభజన చేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించని ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు 1 వ తేదీన ఇవ్వాలంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి. మరి 3 రాజధానులు అంటే ఏ ప్రాంతంలో అభివృద్ధి ఆ ప్రాంతంలోనే చేయాలి. మౌలిక సదుపాయాల కల్పన అంత సులువు కాదు. ఖాళీ ఖజానాతో ఖర్చులు ఎలా చేయగలరు మరింత మోయలేనంత ఆర్ధిక భారం తప్ప. ఒక ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి, భూసేకరణ చేసి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు ప్రారంభం చేయక ముందే అభ్యంతరం చెప్పి, మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి ఉండాల్సింది. అప్పుడు నిశ్శబ్దం వహించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల మనోభావాలను, ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొడుతూ అనవసర అనిశ్చితిని సృష్టిస్తున్నారు. న్యాయ స్థానానికి ఎదురువెళ్లరు, జనాన్ని మభ్య పెడుతూ కాలం గడిపేస్తారు. ఒక వైపు అమరావతి పరిరక్షణ కోసం, ఇంకో వైపు 3 రాజధానుల కోసం పోటీ పడుతూ ఉద్యమాలు చేస్తున్నారు అంతులేని కధ ఇది. 2015 రాజధానికి శంకుస్థాపన జరిగిన నాటి నుండి నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు, అక్కడ నిర్మించిన తాత్కాలి భవనాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినపుడు సైతం ప్రేక్షక పాత్ర వహించి ఇప్పుడు 3 రాజధానులకు వంత పాడటం ఈ ప్రభుత్వానికే సాధ్యమైంది.
       హైకోర్టు తీర్పు వచ్చి నెలలు గడిచిపోయాయి కానీ ప్రభుత్వం తరపున 3 రాజధానులు అంటూ ఈ మధ్య మొదలు పెట్టారు. కోర్టు తీర్పును ధిక్కరించే ధైర్యం ప్రభుత్వము చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. 3 రాజధానుల రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సంకటంలో పడేసింది ఈ ప్రభుత్వమే, జవాబుదారీ ఈ ప్రభుత్వమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way