తెలంగాణ సచివాలయంలో నిర్మించిన ఆలయాలను సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై ప్రారంభించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో గవర్నర్తో కలిసి సిఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రాంగణానికి విచ్చేశారు. సచివాలయంలో కొత్తగా నిర్మించిన ఆలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్తో కలిసి ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన ఆలయాలను నిర్మించింది. ఉద్యోగుల కోసం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్తో కలిసి దర్శించుకున్నారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన గవర్నర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం తెలిపారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం పంపకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆలయాల ప్రారంభోత్సవానికి గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. వారివెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పలువురు మంత్రులు ఉన్నారు.
తెలంగాణ సచివాలయంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో ఆలయం, మసీదు, చర్చిలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను బుధవారమే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం( తిరుమంజనం), వేద పారాయణం, మహాలక్ష్మీ యాగము, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం చండీయాగం, ప్రాణప్రతిష్ఠాపన హోమం, ధ్వజస్తంభ, యంత్ర, విగ్రహాల ప్రతిష్ఠ, వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. సచివాలయంలో నిర్మించిన చర్చి, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com