Search
Close this search box.
Search
Close this search box.

శతజయంతి వేళ.. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల

ఎన్టీఆర్

           తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనడుడు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఆయన స్మృత్యార్థం ఆర్బీఐ రూపొందించిన 100 రూపాయల నాణాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రత్యేక నాణాన్ని విడుదల చేస్తారు. కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో పాటు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నందమూరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ నాణాన్ని ముద్రించింది. 

   ఎన్టీఆర్‌ ముఖచిత్రంతో ఉన్న నాణెం విడుదల కార‌్యక్రమం నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరవుతారని చెబుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణాన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది. 

           టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా అందుకు తగిన సాక్ష్యాధారులను సైతం ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

మహబూబ్‌నగర్‌
మహబూబ్‌నగర్‌ వేదికగా ఎన్నికల శంఖారావం
సచివాలయం
సచివాలయంలో ఆలయాలను ప్రారంభించిన గవర్నర్, కేసీఆర్‌
గోదావరి
గోదావరికి మళ్లీ వరద.. ముంపు భయంలో గిరిజనులు
చంద్రబాబు
ఢిల్లీకి చంద్రబాబు.. వైసీపీ అలర్ట్, ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు
హైకోర్టు
ఏపీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యేకాధికారి నియామకం చెల్లదన్న హైకోర్టు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way