"మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు" అని వేమన ఏనాడో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పేరుకు పథకాలు ఉండు వాటికి నియమాలు మెండు. అప్పుడు ఆర్భాటంగా ప్రచారాలు ఇప్పుడు ఆంక్షల అడ్డు గోడలు నవ రత్నాలు అంటూ జనాలను నమ్మించి పీఠం ఎక్కి, వాటి పేరిట అప్పులు చేస్తూ చిట్టచివరికి ఇచ్చిన వాగ్దానం మరిచి ఎన్నో ఆంక్షలు పెట్టటం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం అనే చెప్పాలి. ఒక పథకం ప్రవేశ పెట్టేటప్పుడు నిర్దిష్ట నియమ నిబంధనలు ఉంటాయి కానీ జగన్ రెడ్డి ప్రభుత్వ తీరే వేరు.
సామాన్యుని కనీస అవసరాల్లో విద్య ఒకటి. ఎవరి స్థోమతను బట్టి వారు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తూ ఉంటారు. అలాంటి నిరుపేద, పేద కుటుంబాల విద్యార్థులకు, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తింప చేస్తూ ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది. ఉద్దేశ్యం మంచిదే. బడిబాట పట్టేలా ప్రోత్సాహం అందించే ఈ పధకాన్ని అభినందించి తీరాలి. అందించే అలాంటి పథకం అమలు చేసే ప్రక్రియలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉండాలి, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి, ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.
విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు అని నియమ నిబంధనలు పెట్టారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి బడి బాట అంటూ 2020లో ప్రారంభించిన ఈ జగనన్న అమ్మ ఒడి పథకం ఉన్న స్థితి నేడు మారిన ఆంక్షలు అడ్డుగోడల్లా మారి విద్యార్థులకు నష్టం కలిగించేలా మారింది 75% హాజరు శాతం అంటే మంచి ఉద్దేశ్యమే. పాఠశాలకు హాజరు కానప్పుడు ఈ పథకానికి అర్హులు కారు అప్పటి 6 నియమాలను సవరిస్తూ ఈ విద్యా సంవత్సరానికి 12 కొత్త నియమాలను పెట్టారు. విద్యుత్తు వినియోగానికి విద్యకు పొత్తు పెట్టారు.
1. 75 శాతం హాజరు ఉండాలి (నవంబర్ 8 నుండి ఏప్రిల్ 30 వరకు)
2. బియ్యం కార్డు కొత్తది ఉండాలి
3. కరెంట్ బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ వాడకం ఉండాలి
4. ఇంటి మ్యాపింగ్ లో పిల్లవాడు తల్లి ఒకే మ్యాపింగ్ లో ఉండాలి
5. కొత్త జిల్లాల పేరు మార్పు చేయించాలి
6. అప్డేట్ ఈ కేవైసీ పిల్లవాడికి చేయించుకోవాలి
7. వాలంటీర్ల దగ్గర విద్యార్థి యొక్క పేరు, వయసు సరిచూసుకోవాలి
8. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి
9. ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేయించుకోవాలి
10. మీ బ్యాంకులో అమౌంట్ గాని లేకపోతే కొంత అమౌంట్ వేసి ఉండాలి.బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి.
11. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ అ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే NPCI చేయించాలి
12. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు
గతంలో అమ్మ ఒడి పంపిణీ చేసినప్పుడు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1000/- అన్ని పాఠశాలల్లో వసూలు చేశారు. వాటి వినియోగంపై ఎలాంటి సమాచారం లేదు. మొదట్లో ఒక కుటుంబం ఇద్దరికి వర్తిస్తుంది అన్నారు. ఇప్పుడు ఒక్కరికే అంటూ మోసం చేస్తున్నారు. 2021 - 2022 విద్యా సంవత్సరానికి కోవిడ్ కారణంగా అమ్మ ఒడి అందించలేదు. ఈ నియమ నిబంధనలతో ఈ ఏడాది కూడా గండి పడేలా ఉంది. ముందే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు లేవు. విద్యా భోదన చేసేందుకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తగినంత మంది లేరు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన లేదు, మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారం అందిస్తున్నారా అంటే అదీ సరిగా ఉండదు. ఉచిత పుస్తకాలు పంపిణీ ఫర్వాలేదు. ఇక యూనిఫారం, బ్యాగుల నాణ్యత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెప్పాలి. ఇచ్చే పథకాలలో కోతలు. పేదవాడికి ఉపయోగపడని ఏ పధకం అయినా వ్యర్ధమే. రత్నం కాదు రత్నంలా భ్రమింపచేసే రంగు రాళ్లు.
- టీం నారీస్వరం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com