Search
Close this search box.
Search
Close this search box.

సంక్షోభంలోకి మత్స్యకారుల జీవితాలు

    తమ మనుగడ కోసం, జీవనం కొనసాగించటాన్ని ఏదో ఒక పనిని ద్వారా ఆదాయం సంపాదించుకోవడం ఉపాధి. అనాది నుండి కుల వృత్తులు ఆధారంగా ఉపాధి పొందేవారు ఏ రంగానికి చెందిన వారు ఆ పనులను చేస్తూ ఆదాయం మార్గంగా ఎంచుకొని బ్రతుకు తెరువు కొనసాగించేవారు. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాన్ని పొందలేక పోయి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నవారు ఎందరో. ప్రకృతి అందించిన వనరులను ఉపాధిగా మార్చుకొని జీవనం కొనసాగించడం ఒక భాగంగా మారిపోయింది. ఎంత ఆధునికత సాధించినా భూమిని దున్ని, పంటలు పండించనిదే ఆహారం అందదు. అవసరాలను తీరుస్తూ ఆదాయం వచ్చే పనులు చేస్తూ, అవసరాల కోసం నేర్చుకున్న పనులు, కుల వృత్తులు కూడా క్రమేపీ ఆధునిక పద్దతుల్లోకి మారి ఆదాయం అందించే మార్గంగా మారుతున్నాయి.

    నేలను నమ్మి రైతులు వ్యవసాయం చేస్తే, నీటిని నమ్మి చేపల వేట చేయటం గంగపుత్రుల జీవితం. నీటి వనరుల ద్వారా ఆదాయం పొందే ముఖ్యమైన వృత్తి మత్స్యకారులదే. చేపల వేట తప్ప ఇంకేమి చేయలేని వీరు చేపలు పట్టే చెరువులు, కుంటలు సముద్ర తీర ప్రాంతాలలోనే ఎక్కువగా నివసించే వీరు ఆర్ధికంగా వెనుకబడి ఉంటారు. ఆర్ధిక పరిస్థితిని సొంత పడవలు, అద్దె పడవలు, సముద్రంలో చేపలు పట్టాలంటే మర బోట్లు ఉపయోగించి చేపల వేట చేయాలి. ప్రాణాలకు తెగించి చేపల వేట చేయాలి ఇంతా చేస్తే ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. దళారీల చేతుల్లో దగా పడటమే పోనీ అధిక ధరకు అమ్ముకునేందుకు దాచుకునే వీలు ఉండదు. ఎప్పటి చేపలను అప్పుడే అమ్మి సొమ్ము చేసుకోవాలి. నిత్యం నీటితో, నీటిలో దొరికే మత్య్స సంపదను అమ్మి సంపద పొందేది మధ్యవర్తులే. సముద్ర తీరప్రాంతాల్లో వాళ్లు వెళ్లే దూరాన్ని బట్టి చేపల వేట ఉంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం పోరాటం చేసే మత్స్యకారుల జీవనం. సముద్రంలో ఆటు పోట్లు లాగే మత్స్యకారుల జీవితంలో పాట్లు, ప్రయాణం చేసే బోట్లు, మత్స్య సంపద వేట, వాటికోసం జరిగే వేలం పాటలు వ్యాపారంతో ముడిపడి ఉంటాయి. మత్స్య సంపదపై ఆధారపడి జీవించే వారందరూ సొసైటీలలో నమోదు చేసుకునేలా ప్రోత్సాహం ఇచ్చి, చేపపిల్లలను పెంచి మత్స్యకారులకు ఇవ్వటం, క్రమపద్ధతిలో చేపలు పెట్టుకొనేందుకు వారికి లైసెన్సులు మంజూరు చేసి వారి అభివృద్ధికి, సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం, మత్స్యకారులు సహకార సంఘాలను నిర్వీర్యం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నం 217 ఉంది. జలవనరులపై ఆధారపడి జీవించే మత్స్యకారులందరి హక్కులు కాలరాస్తూ సొసైటీల హక్కులను తీసేస్తూ  ప్రభుత్వమే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయేలా ఉత్తర్వులు ఇవ్వటమే కాకుండా గెజిట్ కూడా చేసింది. పర్సెంటేజ్ ఇచ్చి పక్కకు తప్పించి వ్యాపారం చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనపడుతుంది. ఆదాయం పెంచుకోవడం అంటే కష్టజీవుల పొట్టకొట్టి వారి ఆదాయానికి గండి కొట్టటం కాదని ఈ ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో? సంపద సృష్టించటం అంటే వేరే వారి శ్రమను దోపిడీ చేసి లాక్కోవడం కాదని తెలియట్లేదు.

     నీటి కాలుష్యాన్ని భరించి, శ్రమను సహించి వేటకు వెళ్లి పూటలు గడుపుకొనే మత్స్యకారుల తమకు ఉన్న జీవనాధారాన్ని కూడా పోగొట్టుకునేలా తెచ్చిన జివో మత్యకారుల జీవితాల్లో చీకటి నింపింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు సమస్యలు పరిష్కారం చేసి తమ ఉన్నతికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని ఆశ పడిన గంగపుత్రులు జీవితాలను గంగ పాలు చేసింది ఈ ప్రభుత్వం. లైసెన్సులు ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పరచాల్సిన చోట మధ్యవర్తులతో ఇప్పటికే ఆదాయాన్ని నష్టపోతుంటే ప్రభుత్వమే దళారీగా మారి వ్యాపారం చేస్తాను అనటం శోచనీయం. వంశపారంపర్యంగా చేపల వేటను ఉపాధిగా మార్చుకొని జీవించే వారిని తమ ఉపాధికి దూరం చేసేలా ఆన్లైన్ ద్వారా టెండర్లు తీసుకొని వేలం నిర్వహిస్తే ఎవరి చేతుల్లోకో వీరి జీవితాన్ని ఇచ్చేసినట్లే కదా సొసైటీలు వేలంలో లీజుకు ప్రభుత్వం నుండి తీసుకొనే ప్రక్రియకు మంగళం పాడినట్లే, ఒక్కో మత్స్యకార సంఘాల్లో వందల మంది ఉంటారు. వారందరి మనుగడ ప్రశ్నార్ధకమే మత్స్యకారుల జీవనాధారాన్ని, వారి జీవితాలను అగమ్యగోచరం చేసేలా, సంక్షేమ ప్రభుత్వం అని పేరు చెప్పుకొంటూ ప్రజలని సంక్షోభంలోకి నెట్టేసి నిర్ణయాలు తీసుకుంటూ పాలన చేయటం ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యింది.

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way