Search
Close this search box.
Search
Close this search box.

సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

          ఒక రాష్ట్ర మనుగడకు, కార్యకలాపాల నిర్వహణకు, ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాల అమలు కొరకు ప్రతి వ్యవస్థ అనుసంధానం అయి నడిపించే ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి అద్వాన్నంగా తయారయింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ అధికంగా అప్పులు చేస్తున్నది. సేవా రంగం ద్వారా వచ్చే ఆదాయం ప్రస్తుత ఆర్థిక అవసరాలను తీర్చే స్థితిలో లేదు. బడ్జెట్ ప్రకటించేటప్పుడు 2022 -23 ఆర్ధిక సంవత్సరానికి 48 వేల కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించి, ఆ మొత్తాన్ని 6 నెలల్లోనే తెచ్చుకున్న ఘనత మన రాష్ట్రానిది. ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం చెపుతున్నా ఇది సాక్షాత్తు కాగ్ ఇచ్చిన నివేదిక.
            ఒక ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అప్పును 6 నెలల్లో తెచ్చారు ఇంకో 6 నెలల అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం, లేదా వేరే దారిలో అప్పులు తేవడం తప్ప వేరే గత్యంతరం లేదు. అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించాలి కానీ అప్పులు కుప్పలుగా చేసి ఆర్ధిక పరిస్థితిని పతనానికి చేర్చి చరిత్ర సృష్టిస్తున్నది. కేంద్రం నుండి వచ్చే ఆదాయపు వాటా, మన రాష్ట్రం నుండి వచ్చే ఆదాయం, నిరంతర ప్రహసనంగా అప్పులు, ఆదాయం పెంచుకునేందుకు ఎన్నో రకాల పన్నులు వేయటం, అన్ని రాష్ట్రాల తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లొనే డీజిల్, పెట్రోలు ధరలు ఎక్కువ, విద్యుత్ చార్జీలు, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆదాయం తగ్గుతుందని ఆదాయం పెంచేందుకు పన్నులు పెంచుతున్నామని నేరుగానే జీవోలు విడుదల చేస్తున్నారు అధికారులు ఎన్ని దారులు ఉంటే అన్ని విధాలుగా ఆదాయం రాబట్టుకొనే ప్రయత్నం ఓ పక్క చేస్తూనే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఆర్బీఐకి అజమాయిషీ లేకుండా చేసే అప్పులు లెక్క లేవు ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తేవటం, వడ్డీ రేటు గురించి కూడా పట్టింపు లేదు. నవ్వి పోదురు గాని నాకేటి సిగ్గూ అన్నట్లు అప్పులు విషయంలో ప్రభుత్వ తీరు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల వల్ల ఆర్ధిక వ్యవస్థ తో పాటు రాష్ట్రమే దివాలా తీసే పరిస్థితి లోకి వెళ్ళిపోతుంది. 6 నెలల్లో 29 వేల కోట్ల రూపాయల అప్పు చేశారంటే అది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సూచిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే ఆనవాలు కూడా కనపడదు. సంక్షేమ పథకాల పేరుతో ఖాతాలోకి వేసారా అంటే అంత పెద్ద మొత్తం వేసిన పధకం లేదు. అవి కూడా వందల కోట్లలోనే లావాదేవీలు జరిగాయి.

          రవాణా వ్యవస్థ రోడ్లు వేసింది లేదు, 3 రాజధానులు అని నోటి తో చెప్తున్న వాటి కొరకు ఏదైనా అభివృద్ధి చేసారా అంటే అదీ లేదు. నోటితో చెప్పి నొసటి తో వెక్కిరించినట్లు ఉంది అభివృద్ధి అనేది. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపేయటమే పనిగా పెట్టుకున్నట్లుంది ముంచడమే కాదు ఆస్తుల్ని అడ్డంగా అమ్మేయడానికి బిల్డ్ ఏపీ అని ప్రోగ్రాం పేరు పెట్టి బారో ఏపీ ప్రోగ్రాం ప్రజా ఉపయోగంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మడానికి వరుసగా ఏర్పాట్లు చేసుకుంటుంది. కోర్టుల్లో కేసులు ఉన్నా ఎవరైతే మాకేంటి అనుకునే ప్రభుత్వం అమ్మక మానదు. అంటే ఆస్తులు అమ్మేసి అప్పులు మిగల్చబోతున్నారు. సంపద లేని అప్పుల కుప్ప రాష్ట్రంగా ఏపీ మిగలబోతోంది. దాని పర్యవసానం రాష్ట్రం దివాలా తీయటమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎప్పుడూ వివాదంగానే ఉంటుంది. లెక్కల వివరణ సరిగా లేదని కాగ్ చెప్తుంది, ప్రభుత్వం ఈ విషయం పై మాట్లాడదు వేల కోట్ల నిధుల సేకరణ, ఖర్చు పై ఎలాంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. ఎవరు ప్రశ్నించినా సమాధానం ఉండదు పైగా జవాబు చెప్పకుండా వ్యక్తిగత దూషణలు. కానీ కాగ్ ఇచ్చే నివేదికలోని లెక్కలు అబద్ధం కాదు పూర్తి వాస్తవాలు. అవసరానికి మించి అప్పులు, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఎప్పుడూ ప్రమాదమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way