প্রিন্ট এর তারিখঃ ডিসেম্বর ২৬, ২০২৪, ১:১৩ এ.এম || প্রকাশের তারিখঃ জানুয়ারী ৩০, ২০২২, ৩:৪৬ এ.এম
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం
పోలవరం ప్రాజెక్టు - ఆర్ధిక సంక్షోభం
ఉద్యోగ కల్పన - ఆర్థిక సంక్షోభం
ఉద్యోగ భద్రత - ఆర్థిక సంక్షోభం
రోడ్లు వేయడం - ఆర్థిక సంక్షోభం
ఇలా రాష్ట్రంలోని ఏ సమస్య కోసం అడిగినా, ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి గురించి అడిగినా ప్రభుత్వ మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు చెబుతున్న ఒకే ఒక మాట ఆర్థిక సంక్షోభం...
"ఉట్టికి ఎగరలేనమ్మ... స్వర్గానికి ఎగురుతాను అందట" అలా ఉంది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు. ఓవైపు రాష్ట్రం ఆర్ధిక సంక్షోభం కారణంగా కష్టాల్లో ఉందంటూ మీడియా ముందు మంత్రులు ఆర్థిక మంత్రి సీఎంతో సహా ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తున్న తరుణంలో ఇటీవల రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు ఫిషింగ్ హార్బర్ల పై జరిగిన సమీక్షలో భాగంగా సీఎం జగన్ రెడ్డి జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మించాలని సూచనప్రాయంగా చెప్పడమే తరువాయి క్యాబినెట్ మీటింగ్ లోనూ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. రోడ్లు వేయడానికి బాగోని ఏపీ ఆర్థిక పరిస్థితి జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మించడానికి బాగుందా !?? అంధకారంగా ఉన్నా ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి కూడా జిల్లాకి ఒక ఎయిర్ పోర్ట్ ను ఎలా నిర్వహిస్తారు అనేది ఎవరికి ఊహకందని అంశంగా మారింది. అసలు రిపోర్టు వల్ల పేద, మధ్యతరగతికీ చెందిన ప్రజలకు ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న సర్వత్ర ఉత్పన్నమౌతుంది. అడుగుకో గుంత గజానికో గొయ్యి ఉన్న ఏపీలో రవాణా, రోడ్ల వ్యవస్థ ను పట్టించుకొనే దిక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ కు వివిధ రూపాల్లో అందిస్తున్నామని రాష్ట్ర విభజన తర్వాత 2014- 15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021- 22 వరకు గత ఎనిమిదేళ్లలో ఏపీ కు పన్నుల వాటా కింద మొత్తం ₹4,40985 కోట్ల ఆర్థిక వనరులు అందించామని, రెవెన్యూ లోటు పెరగడానికి అమ్మఒడి ఉచిత విద్యుత్ లాంటి పథకాలు కారణం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం సంక్షేమం పేరు చెప్పి చేస్తున్న దుబారా ఖర్చుల విషయం స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రానికి జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి గాని, రైతుల దగ్గర కొన్న ధాన్యానికి చెరుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం విషయంలోనూ, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించలేని స్థితిలో ఉండి కూడా ప్రభుత్వం సామాన్యుడి అవసరాలు తీర్చలేని ప్రభుత్వం జిల్లాకు ఎయిర్ పోర్ట్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పుతూ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కదారి పట్టేస్తుంది. సంపద సృష్టించడం చేతకాక OTS పేరుతో పేద ప్రజల దగ్గర అ బలవంతపు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఆఖరికి చెత్త మీద, డ్రైనేజీ మీద కూడా పన్నులు వేసి నడ్డి విరుస్తున్నారు. అలాంటిది జిల్లాకు ఎయిర్ పోర్ట్ అనేది సామాన్యుడికి ఉపయోగపడేనా అని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. జీతాలకు డబ్బులు లేవు, రోడ్ల మరమ్మతులకు నిధులు లేవు అని చెప్పి ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మన ప్రభుత్వానిది. జిల్లాకో ఎయిర్పోర్ట్ సాధ్యమేనా ??? తాజాగా జిల్లా వికేంద్రీకరణ అంటూ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు 13 జిల్లాల్లో ఎయిర్ పోర్ట్ లో పెడతారా ? లేక 26 జిల్లాలో ఎయిర్పోర్టు కడతారా ?, అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సామాన్యుడు నిత్యం తిరిగే రోడ్లలో ఉన్న గోతులు బాగు చేయకుండా ఎయిర్ పోర్ట్ లో కడతాము అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వైసీపీ ప్రభుత్వం సామాన్యుని మోసం చేస్తుంది అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు జిల్లాల పునర్విభజన జరగాలంటే ఆయా జిల్లాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఒక్కొక్క జిల్లాకి ₹400కోట్లు అంటే 26 జిల్లాలకి కలిపి ₹10600కోట్లు ఖర్చవుతుంది. 13 జిల్లాల పరిపాలన వ్యవస్థ సిబ్బంది ఇప్పుడు సుమారుగా రెట్టింపు అవ్వాలి కదా!
ఒక్కో జిల్లాకు ఒక్కో ఐఏఎస్
ఇంతకు 13 అనుకుంటే ఇప్పుడు 26
ఇలా చాలా విభాగాలు రెట్టింపు అవ్వాలి జీతాలు ఇవ్వగలరా! అనే ప్రశ్న సర్వత్ర ఉత్పన్నమవుతుంది.