క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం

సభ్యత్వం

              రేపటి తరాల భవిష్యత్తు కాంక్షించి, సమ సమాజ శ్రేయస్సుకు బాటలు వేస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో, ఆశయాల బాటలో సిద్ధాంతాల సాయంతో సామాన్యులు సైతం రాజకీయం చేసేలా యువత కలలు సాకారం అయ్యేలా జనసేనాని పూరించిన శంఖం “జనసేన పార్టీ”. జనం కోసం మేమున్నాం అనే ధైర్యం నింపుతూ ఎన్నో ప్రజా సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుల్లో నడుస్తూ ఆశయాల ప్రయాణాన్ని సాగిస్తున్న తన సైన్యం ఎలాంటి అపత్కాలంలో ఇబ్బందులు పడకూడదని ఎంతో నిబద్ధతతో పార్టీ భావజాల వ్యాప్తికి, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీ కొరకు అనుక్షణం శ్రమించే తమ పార్టీ కార్యకర్తలను కుటుంబంగా భావించి వారి యోగ క్షేమాలు కాంక్షించి జనసేనాని చేపట్టిన మహా సంకల్పం “క్రియా శీలక సభ్యత్వం”.

            రాజకీయమనే యుద్ధంలో సిద్ధాంతాల ఆయుధాలతో మూస పోసిన వారసత్వ రాజకీయ యవనికపై మార్పు కొరకు కంకణం కట్టుకున్న ఆయుధం పట్టని యోధుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో సంఘటన జరిగితే చలించి పోయి తన వంతు సాయం అందించటంలో ఎప్పుడూ అగ్రజుడే. అంతటి ఉదారత్తమైన హృదయం కల ఆయన ఒక పార్టీ అధినేతగా తన వెంట నడిచే వారి క్షేమం కోసం, వారి సంక్షేమం కోసం కోటి రూపాయల నిధితో క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆపదలో అనూహ్యమైన ఆర్ధిక సహాయం అందేలా ఆలోచించి సంకల్పించారు. స్థిరమైన ఆలోచన సంకల్పమై ఎన్నో కుటుంబాలకు ఆపదలో బాసటగా నిలిచింది. నిస్సహాయులకు ఆసరా అయింది, దైన్యంలో భరోసా నింపింది. దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయని పని జనసేన పార్టీ ద్వారా చేసి చూపిస్తున్నారు. నిరంతరం పార్టీ కొరకు శ్రమించే కార్యకర్తలకు 5 లక్షల భీమా సౌకర్యం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించారు.
              సభ్యత్వం తీసుకొనే వారు నామమాత్రంగా కొద్దిపాటి రుసుమును వారి వ్యక్తిగత బాధ్యతగా భావించి 500/- చెల్లిస్తే చాలు ఏడాది పాటు ధీమా గా ఉండొచ్చు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల భీమా కుటుంబ సభ్యులకు అందించి ఆదుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే 50000/- ప్రమాద భీమా తో పాటు ప్రపంచంలో ఎక్కడైనా వైద్య సేవలు అందుకునే వెసులుబాటు తో పాటు ఆరోగ్య భీమా అందిస్తారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకుంటే క్రియాశీలక సభ్యత్వంతో పాటు భీమా కొనసాగింపు ఉంటుంది. ఈ క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన కార్యక్రమాలు పర్యవేక్షణ కొరకు, తగిన సమాచారం అందించి, సత్వర సహాయం అందించేలా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక డెస్క్ ని ఏర్పాటు చేశారు.
                 పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తుంది ఈ ‘క్రియాశీలక సభ్యత్వం’. ఇప్పటి వరకూ ఈ ప్రమాద భీమా 67 మంది జనసైనికులకి అండగా నిలిచింది. 5 లక్షలు చొప్పున 26 మందికి అండగా నిలిచింది.

క్రియాశీలక సభ్యత్వ నమోదు కొరకు : 
1. ఫోటో
2. ఫోన్ నంబర్
3. ఆధార్ కార్డ్
4. నామిని ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్
5. 500 /- సభ్యత్వ రుసుము

జనసైనికులు, వీరమహిళలు మన క్షేమం కాంక్షించే జనసేనాని ఆలోచనను అందుకొని ఆ దిశగా అడుగులు వేయాలని ప్రియమైన జన సైన్యం కోసం “క్రియాశీలక సభ్యత్వం”. 

 – టీమ్ నారీస్వరం 

16 Responses

  1. జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న మా నాయిబ్రహ్మణ కమ్యూనిటీ నుండి apనాయిబ్రహ్మణ జనసేన సపోర్ట్స్ పేరుతో రాష్ట్రంలోని అని జిల్లాల నాయిబ్రహ్మణుతో కమిటీలు ఏర్పాటుచేసి జనసేన ఓటు బ్యాంక్ పెంచే ప్రయత్నంలో ఉన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way