మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై తీవ్రంగా ధ్వజమెత్తిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి

                నెల్లూరు సిటీ శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో జరుగుతున్న సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాల్ కాంట్రాక్టు పనులను నెల్లూరు సిటీ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువలో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న రిటైనింగ్ వాల్ ప్రాజెక్టు ని ఓ బోగస్ అంశంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2015 నుండి 2018 మధ్య అంచనాలు వేసిన అనేక నీటి ప్రాజెక్టులకు (పోలవరంతో సహా) సంబంధించి ఈ ప్రభుత్వం రాగానే అంచనాలు తగ్గించి రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం వచ్చిందనే ప్రకటనలు మనం చూశామన్నారు. కాని 2015 లో నెల్లూరులో సర్వేపల్లి కాలువలో 5 కిలోమీటర్లు, జాఫర్ సాహెబ్ కాలువ 2 కిలోమీటర్లు, కృష్ణపట్నం కాలువలో 2.2 కిలోమీటర్లు, ఇలా మొత్తంగా సుమారు 10 కిలోమీటర్లకు కాలువల్లో రీటైనింగ్ వాల్ మరియు బెడ్ కాంక్రీట్ నిర్మాణాలకు వేసిన అంచనా 88 కోట్ల రూపాయలని, అంటే 3 కిలోమీటర్లకు సుమారు 30 కోట్ల రూపాయలు మాత్రమేనని అన్నారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో రాష్ట్రంలోని అనేక నీటి ప్రాజెక్టుల మాదిరే ఈ సర్వేపల్లి కాలువలో ప్రస్తుతం నిర్మితమవుతున్న 2.7 కిలోమీటర్లకు గత అంచనాల కంటే తగ్గాలి అంటే ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ 30 కోట్ల రూపాయల లోపు ఉండాలి కానీ ఏకంగా 87 కోట్లగా అంచనాలు వేసి 84 కోట్లకు బినామీకి కట్టబెట్టడంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికార దుర్వినియోగం, ధన దాహం ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. దీనిలో సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష అవినీతికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఈ ప్రతిపాదన మొదలెట్టిన నాటి నుండి ఈ అంశంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పోరాడుతూ ఎప్పుడెప్పుడు తమ ఇళ్ళు కూలిపోతాయా అని భయపడుతున్న పేదల ఇళ్ళు కూలకుండా చేసిన ఘనత తమ జనసేన పార్టీదేనని అన్నారు. తాము మొదటినుండి ఇదొక పనికిమాలిన ప్రాజెక్టు అనే విషయాన్ని చెప్తున్నామని, రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టే బినామీ కాంట్రాక్టుగా వేసిన వ్యూహమే గతంలో తెరమరుగైన ఈ రీటైనింగ్ వాల్ ప్రాజెక్టు అని అన్నారు. గత 60 ఏళ్ళలో సర్వేపల్లి కాలువ నెల్లూరు నగరంలో ఎప్పుడూ పొంగలేదని, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతుల నుండి కూడా తగిన స్థాయిలో నీరు అక్కడి చెరువుకి రావట్లేదనే ఫిర్యాదులు లేవని, అలాంటప్పుడు దీనిని ఇంత హడావుడిగా ఆధునీకరించాల్సిన అవసరమే లేదన్నారు. నెల్లూరులో సరైన నిర్వహణ లేని అనేక పంట కాలువలను, డ్రైనేజి కాలువలను మంత్రి అనిల్ పట్టించుకోలేదని అన్నారు. ఆగిపోయి ఉన్న నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి పనులను పట్టించుకోవట్లేదని అన్నారు. అత్యంత అవసరం అయిన సోమశిల రివిట్మెంట్ నిర్మాణం గురించి అధికారుల బృందం ఆరు నెలల క్రిందటే నివేదికలు ఇచ్చినా మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్షించే వరకూ మంత్రి అనిల్ నిద్రపోతున్నారని అన్నారు. సర్వేపల్లి కాలువలోని రీటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం మాత్రం మంత్రి అనిల్ నిద్రపోకుండా తన సమయం మొత్తం కేటాయించి ఉన్నారని అన్నారు. పళ్ళ డాక్టర్ అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ కెనాల్ లో రూట్ కెనాల్ సలహాలిస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఒక్కసారి బెడ్ కాంక్రీట్ ఉంచుతారని, మరోసారి బెడ్ కాంక్రీట్ పీకేస్తారని, జిల్లాలోని అధికారులు ఈ చర్యల ద్వారా ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. బెడ్ కాంక్రీట్ కూడా లేకుంటే ప్రాజెక్టు విలువ ఇంత ఎక్కువ మొత్తంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. మంత్రి మీద అంత ప్రేముంటే అధికారులందరూ ఆయన ఇంట్లో చాకిరీ చేసుకోవాలని సూచించారు.  మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సర్వేపల్లి కాలువపై చూపిస్తున్న ప్రేమ, మమకారంలో కనీసం పది శాతం రాష్ట్రంలో ముఖ్యమైన పోలవరం వంటి ప్రాజెక్టుల మీద చూపిస్తే తన శాఖ ఇంత అధ్వాన్నంగా తయారై ఉండేది కాదని అన్నారు. ఈ కాలువ రీటైనింగ్ వాల్ నిర్మాణం అంశంలో ఉండే అవకతవకలు, అక్రమాలపై గత మూడు నెలలుగా నిరసిస్తూ, దీని వల్ల నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు కలిగే ఇబ్బందులను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నామని, ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని కనుక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, షేక్ ఆలియా, శిరీష, మోష, శ్రీను ముదిరాజ్, కుక్కా ప్రభాకర్, రాజా, నాసీర్, రాము, హేమంత్ రాయల్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240125-WA0011
మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
IMG-20240108-WA0010
నెల్లూరు నగరంలో హోరెత్తిన జనసేన జెండా
నెల్లూరు
నెల్లూరు సిటీలో జనసేన జెండా ఆవిష్కరణ 
Varahi Updates
Varahi Updates : How to improve 5 best Knowlwdge sites
IMG-20230904-WA0042
జనసేన కెనడా ఐటి టీమ్ ఆధ్వర్యంలో వీడియో ఎడిటింగ్ కోర్సు ప్రారంభం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way