తణుకు నియోజకవర్గం, తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన జన సైనికుడు అడ్డాల శ్రీహరి గారు ఇటీవల యాక్సిడెంట్ కు గురికావడం జరిగింది. అతనికి ప్రవాస జనసేన సింగపూర్ మరియు యర్రంశెట్టి మణికంఠ వారి ఫ్రెండ్స్ సహకారం తో 81,000/- వేల రూపాయలు ఆర్థిక సాయం తణుకు నియోజకవర్గo జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావుగారు చేతులు మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మారిశెట్టి మురళి, కొత్తపల్లి శ్రీనివాస్ మరియు పోలిశెట్టి వాసు, బెజవాడ సూరి, పంతం నానాజీ, ఆకెటి కాశి, చిక్కాల వేణు, తులసి మరియు తణుకు, పైడిపర్రు జన సైనికులు పాల్గొన్నారు.