భీమవరం ( జనస్వరం ) : పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులు సబ్ జైలుకు వచ్చి జయప్రకాష్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోర్టు ఆక్షన్ ద్వారా 1.15 సంట్ల స్ధలంలో రెడ్డి & రెడ్డి సంస్థకు చెందిన రౌడీలు కంచె వేస్తుంటే తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్లారు. అధికార పార్టీ మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడికి వల్ల పోలీసులు అక్రమంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారిని నేరస్థులుగా కేస్ పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖటడించారు. పార్టీ తరుపున పూర్తి మద్దతు ఇస్తూ న్యాయ పోరాటం చేస్తామని తెలియచేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు అడ్వకేట్ అనుకుల రమేష్, నరసాపురం నియోజకవర్గ జనసేన నాయకులు చాగంటి మురళీకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ పిఎసి మెంబర్ కనకరాజు సూరి, ఉండి నియోజకవర్గం ఇన్చార్జి జుత్తిగ నాగరాజు, గుండా రామకృష్ణ తదితరులు గుండా జయప్రకాష్ నాయుడు ను తణుకు సబ్ జైలుకు వెళ్లి పరామర్శించి ఆయనకు పూర్తిగా అండగా ఉంటామని తెలియపరిచారు.