Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ రంగుల రాజకీయం

వైసీపీ

         ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రంగుల చుట్టూ తిరుగుతున్నది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార వాహనానికి “వారాహి” అని పేరు పెట్టటం, ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అనటంతో ఆంద్రప్రదేశ్ రాజకీయాలు వారాహి చుట్టూ, వారాహి వాహనానికి వేసిన రంగు చుట్టూ చేరి పోయాయి. “ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి” అన్నట్లు జనసేన అంటే మాకు లెక్క లేదంటూనే జనసేనాని, జనసేననే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన నేతలచేత విమర్శలు చేయించడం ఒక ప్రహసనంగా మారిపోయింది. అసలు జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాల పట్ల, జనసేనాని తీసుకొనే నిర్ణయాల పట్ల, ఆయన ప్రసంగాల మీద జనసైనికుల కంటే వైసిపి పార్టీ నాయకులే శ్రద్ధ పెడతారు అనిపించకపోదు. ఆయన మాట్లాడటం ఆలస్యం వెంటనే మీడియా సమావేశాలు నిర్వహించటం, ట్విట్టర్ వేదికగా ట్వీట్లు వేయటం చూస్తుంటే ఇటువంటి ఊసుపోని రాజకీయాలు తప్ప ప్రజలకు చేసిన ఉపయోగాలు లేవు. ఇక వారాహి వాహనం ప్రస్తావనకి వస్తే వాహనం పూర్తిగా సైనికులు యుద్ధంలో ఉపసయోగించే వాహనంలాగా కనిపిస్తుంది. భద్రతతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక లైటింగ్ సౌకర్యం, ఆధునిక సౌండ్ సిస్టం, వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు, హైడ్రాలిక్ మెట్లు వంటి ఆత్యాధునిక సదుపాయాలు, ప్రత్యేక వసతులతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జనసేనాని యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనం యొక్క రంగు ఆలివ్ గ్రీన్ కలర్ లో వాహనం ఉందని, నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడకూడదని, రిజిస్ట్రేషన్ అవ్వదని చర్చలు, వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. అది పూర్తిగా జనసేన పార్టీ అంతర్గత విషయం, వాహనానికి ఏ రంగు వేస్తే అనుమతులు లభిస్తాయో తెలియనంత అజ్ఞానంలో జనసేన పార్టీ నాయకత్వం వుండదు. పైగా అధికారం చేపట్టినప్పటి నుండి గ్రామ సచివాలయాలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, రైతు భరోసా కేంద్రాలు, గోదాములు, స్మశానాలకు, సమాధులకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో విద్యార్థుల ముఖాల పై, మరుగుదొడ్లు, డివైడర్ ల మధ్య చెట్లకి, దేవాలయాలకు పార్టీ రంగుల విద్యుత్ దీపాలు, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి, జాతీయ జెండా కు పార్టీ రంగులు పులిమిన అజ్ఞానులు, రంగుల పిచ్చి నాయకులు నీతులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి లో సిద్ధం కానీ వారాహి వాహనం పై వ్యాఖ్యలు చేస్తూ తమ స్థాయిని బహిర్గతం చేసుకుంటున్నారు.
                ఏది ఏమైనా మన రాజకీయ నాయకులు విలువలు లేని వ్యక్తులుగా మారిపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి అయింది. అక్కడ ఇక్కడా అప్పులు తెచ్చి ఒక్క బటన్ నొక్కి డబ్బులు వేయటం తప్ప ప్రజోపయోగ కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు, విధానాలు లేవు విమర్శలు, బూతులు తప్ప. నిన్నటి దాకా 3 రాజధానుల మంత్రం నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాగం,. ప్రజలను మభ్య పెట్టటంలో తప్ప ఏ విషయంలోనూ స్పష్టత లేదు వీళ్ళు పమన పాలకులు. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చెయ్యాలి అనే అజెండాతో ఆర్థిక వనరులు మీద దెబ్బ కొడుతూ అవసరం అయితే వ్యక్తిగత, వ్యక్తిత్వం పై నిందలు వేస్తూ గడిపేయటం తప్ప ఏమీ చేయట్లేదు.
               అష్ట దిక్కులను కాచే అమ్మవారిగా, లలితాదేవికి సైన్యాధిపతిగా లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలిచే వారాహిదేవి దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు, గజ, తురగ, సైన్య బలాలు వారాహి అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. దండనాథ ఆని పిలువబడే శక్తి వంతమైన వారాహి అమ్మవారి పేరును పవన్ కళ్యాణ్ గారు ఈ వాహనానికి పెట్టి ఉంటారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రంగుల పిచ్చితో ఖర్చు చేసి న్యాయ స్థానం మొట్టికాయలు వేస్తే తప్ప తీరు మార్చుకొని వేరే రంగులు వేసి రెట్టింపు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ పార్టీ నాయకులు వ్యక్తిగత వాహనానికి వంకలు పెడుతున్నారు. ఇలాంటి మాటలతో వారాహి కి దిష్టి తీసినట్లే. ఆటంకాలను తొలగించి అష్ట దిక్పాలకులు, అది పరాశక్తి, కొండగట్టు ఆంజనేయుడు మీ ఆశయ సిద్ధికి తోడు గా నిలిచి ఆశీర్వదిస్తారు. వారాహీ… విజయోస్తు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way