Search
Close this search box.
Search
Close this search box.

” నా సేన కోసం నా వంతు “

          సరిహద్దులు లేనిది, హద్దులు చెరిపేసి అందరిని ఒక్కచోట చేర్చేది అభిమానం. కోట్ల మంది అభిమానులు ఉండటం, ఆ అభిమానమే ధనంగా, అభిమానులే నడిపించే ఇంధనంగా, గెలుపు, ఓటమి సంబంధం లేకుండా సాగుతున్న నిరంతర ప్రవాహం. సినిమా రంగంలో రికార్డులు తిరగరాసే శక్తివంతమైన అభిమాన గణం, రాజకీయ పరంగా అధినేత అడుగుల్లో నడిచే జనసైన్యం ఉండటం జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అతి పెద్ద బలం. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రాణం పెట్టి ముందుకు తీసుకొని వెళతారు. ప్రతి సంవత్సరం అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకను ఎంతో ఘనంగా, ఉత్సాహం నింపుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తూ అభిమానాన్ని చాటుకొనే సంప్రదాయం ఉంది. వ్యక్తిగతంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండే మన నాయకుని జన్మదినాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే మనం అధినాయకుని వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే రాజకీయ ప్రస్థానంలో మన వంతు భాగస్వామ్యం ఇవ్వటం మన అందరి బాధ్యత.
                ఏ రాజకీయ పార్టీ మనుగడ అయినా విరాళాల మీద ఆధారపడి ఉంటుంది కానీ జనసేన పార్టీ నిర్వహణ భారం మొత్తం అధినేత పైనే ఉంది. స్వచ్ఛందంగా వచ్చే విరాళాలు తప్ప ఆయన అడగరు. ఈ విషయంలో స్వచ్ఛంద ఆర్ధిక సహాయం చేసే వారు కూడా ఉండటం వలన మన జనసేనానికి కొంత ఆర్ధిక భారాన్ని తగ్గిస్తున్నారు. నవతరానికి చైతన్యం కలిగించే విధంగా, జనాన్ని మంచి లక్ష్యం వైపు ప్రయాణించేలా పారదర్శకత ప్రతిబింబించేలా ఎన్నో వినూత్న ఆలోచనలు చేస్తూ, ఆచరించే రాజకీయ పార్టీ అధినేతగా జనసేనాని రాజకీయ యవనిక పై కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. అటువంటి మన నాయకునికి అండగా నిలవాల్సిన సమయం ఇది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఆచరించే సమూహ నిధుల సేకరణ (Crowd Funding) ద్వారా పార్టీ అభివృద్ధికి కొత్త పంథాను అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. స్కీముల పేరుతో స్కాములు చేసే రాజకీయ నాయకుడు కాదు, వచ్చే ఆదాయానికి నిక్కచ్చిగా టాక్స్ కట్టే మచ్చ లేని నాయకుని కోసం మద్దతుగా నిలబడాలి.
                   మన రేపటి భవిష్యత్తు కోసం ఆయన పోరాడుతుంటే పార్టీకి అండగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా సాగుతున్న ప్రస్థానంలో అందరిని భాగస్వామ్యం ఉండేలా క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ చేపట్టాలి. మనం నమ్మిన నాయకుడి కోసం, నడిపిస్తున్న సిద్ధాంతాల కోసం, ఆచరిస్తున్న విధానాల కోసం, పార్టీ నిర్వహణ కొరకు మన వంతుగా ఆర్ధిక సహాయం అందించటానికి మార్గం సానుకులమవుతుంది. ఈ ప్రక్రియలో మన పార్టీ భావజాలం జనాన్ని ఎంత ప్రభావితం చేసిందో తెలియటంతో పాటు వచ్చిన జమ, ఖర్చుల లెక్కల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తుల నుండి, సంస్థల నుండి, కార్పొరేట్ వ్యాపార సంస్థల నుండి సేకరించినట్లు విరాళాలు సేకరిస్తే అధికారం చేపట్టినప్పుడు వారి ప్రయోజనాల కోసం ప్రజలను పక్కకు పెట్టే పరిస్థితి వస్తుంది. అవినీతి రాజ్యమేలుతుంది అవినీతి పై రాజీ లేని పోరాటం సిద్ధాంతం గా సాగే జనసేన పార్టీ అనుచరులుగా ఈ తరహా విధానానికి స్వస్తి చెప్పి “సమూహ నిధుల సేకరణ” పై దృష్టి సారించి ఈ విధానం వివరిస్తూ మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, సన్నిహితులను, పార్టీ సానుభూతి పరులను “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగస్వామ్యులను చేద్దాం. పైగా ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రతి ఒక్కరిని భాగస్వాములు అయ్యేలా 10 /- రూపాయలు కూడా మనస్ఫూర్తిగా ఇచ్చే విధంగా “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తక్కువ మొత్తములో అయినా ఎక్కువ మందిని ఈ కార్యక్రమ భాగస్వామ్యం వైపు నడిపించుదాం.
         ఎన్నో ఏళ్ళు గా అభిమానాన్ని ఏదో ఒక రూపంలో తెలియచేసే మనం పార్టీ అభివృద్ధికి ఉపయోగించేలా తోచినంత ఆర్ధిక సహాయం అందించేందుకు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలి. ఎందుకంటే మన ప్రయత్నం సమాజం కొరకు, మన అడుగులు రేపటి తరాల కొరకు, మన పయనం మార్పు వైపు కొనసాగాలి. జై జనసేన !!
        “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం 7288040505 నంబర్ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, పేటియం ఏదైనా ఉపయోగించి విరాళం అందించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way