Search
Close this search box.
Search
Close this search box.

జనసేన అధినేతపై ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గుంతకల్లు జనసేన నాయకులు

      గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్లు పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 3,000 వేల మంది కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మొదటి విడతగా 5 కోట్ల తన సొంత నిధులను వెచ్చించి ఒక్కొక్క కౌలురైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా మేమున్నామని “కౌలురైతు భరోసా యాత్ర” మొదలెట్టినప్పుడు నుండి ఆ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన రావడంతో వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. అప్పటినుండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్న వైసిపి నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మరీ ముఖ్యంగా గుంతకల్ శాసనసభ్యులు, వైసిపి కార్యకర్తల సమావేశంలో కళ్యాణ్ గారి పై మాట్లాడిన చౌకబారు విమర్శలను ఖండించారు. మా నాయకుడు ప్యాకేజీ తీసుకుని ఉంటే ప్రభుత్వం మీది పోలీసులు మీ వాళ్ళు నిరూపించండి లేదా అర్థంలేని విమర్శలు మానుకోండి అని హితవు పలికారు. పామిడి మండలం నీలూరు మరియు కొండాపురం గ్రామ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సంవత్సరాలు గడుస్తున్న ఆదుకున్న పాపాన పోలేదు మీరు, మీ ప్రభుత్వం కానీ మా నాయకుడు మనీలా గ్రామంలో జరిగిన “కౌలురైతు భరోసా యాత్ర” లో ఆ రెండు కుటుంబాకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున సహాయం చేసి భరోసా కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే అయినా మీరు మాత్రం చేసింది శూన్యం. ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద బాధ్యత లేని మీరెక్కడ సామాజిక బాధ్యతతో ఆపదలో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తన సొంత నిధులు 30 కోట్ల రూపాయలు దానం చేసి భరోసా కల్పిస్తున్న మా నాయకుడు ఎక్కడ ఇకనైనా ఇలాంటి చౌకబారు రాజకీయ విమర్శలు పక్కనపెట్టి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిపై దృష్టి సారించండి లేదా రాబోయే ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని గద్దె దింపి మీకు తగినశాస్తి చేస్తారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్, గుంతకల్, గుత్తి, పామిడి మండలాధ్యక్షులు కురువ పురుషోత్తం, పోతురాజుల చిన్న వెంకటేశులు, M.ధనుంజయ్, వీరమహిళ సంధ్య, ఈరమ్మ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శేఖర్, సుబ్బయ్య, బోయ సురేష్, పాండు కుమార్, వీరేశ్, విజయ్ కుమార్ జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, S.కృష్ణ, సోహెల్ నిస్వార్థ జనసైనికులు మధు, జిలాన్, మంజునాథ్, జగదీష్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way