కొండపల్లి, (జనస్వరం) : కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి రైల్వే స్టేషన్ లో శాతవాహన స్టాప్ కొరకు అలాగే కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు( గాంధీ ) ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలసి రైల్వే GM ( సౌత్ సెంట్రల్ రైల్వే) అరుణ్ కుమార్ జైన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కల రామ్మోహనరావు( గాంధీ ) మాట్లాడుతూ కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు GM ని కలిసి వివరించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే కావాల్సిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, పగిడిపల్లి వెంకట్, రాగాల నాని, యర్రంశెట్టి సాయి, సామల సుజాత, దేవరకొండ చరణ్, సురేష్, చిట్టెలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, రమేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.