జగ్గయ్యపేట ( జనస్వరం ) : జగ్గయ్యపేట నియోజకవర్గంలో కంభంపాడు, దాములూరు, నందిగామ నియోజకవర్గంలో కేసరా, చందర్లపాడు, ముప్పాలా తదితర గ్రామాలలో గుర్తుతెలియని దుండగులు జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపుతున్నారు. అలాంటి వారిపై సమగ్ర విచారణ జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని జగ్గయ్యపేట నియోజకవర్గం దాములూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తరువాత నందిగామ DSP గారికి మరియు నందిగామ CI కనకరాజు గారికి వినతిపత్రం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బొలియశెట్టి శ్రీకాంత్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ మరియు జగ్గయ్యపేట, నందిగామ జనసైనికులు పాల్గొన్నారు.