● జనసేనాని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న దళితులు
● ఆవిర్భావ దినోత్సవం తరువాత రాష్ట్రంలో గణనీయంగా రాజకీయ పరిస్థితులు మారుతాయి
● చలో అమరావతి పేరుతో రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉంటుంది
● ఆవిర్భావ సభ కి విజయవాడ నుంచి సుమారు లక్ష మంది హాజరవుతారు
● విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ
● విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ను విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక పవన్ కళ్యాణ్ పేరు ఖరారు చేసినందుకు దళితులందరూ పవన్ కళ్యాణ్ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ని దళిత పక్షపాతని కొనియాడుతున్నారని తెలియజేశారు. చలో అమరావతి పిలుపుతో రాష్ట్ర రాజధాని అమరావతి గానే ఉంటుందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు. రాష్ట్ర దశ దిశ మారుతుందని, పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ముందుకు వెళుతుందని తెలియజేశారు. అనేక ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడుతున్నారని తెలియజేశారు. ఆవిర్భావ సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ అనేక కుట్రలు చేస్తుందని అందుకే అనుమతులు మంజూరు చేయడానికి కాలయాపన చేశారని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారన్నారు. జనసేన యువతతో పెట్టుకోవద్దని హెచ్చరిక జారి చేసిన తదుపరి అనుమతులు లభించాయని, విజయవాడ నగరం నుంచి లక్ష మందికి పైగా మూడు నియోజకవర్గాల నుంచి ఆవిర్భావ సభకు తరలి వస్తారని ఇప్పటికే విజయవాడ నగరంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారని, సభను విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వెన్న.శివశంకర్, కమల్ల.సోమనాథం, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి.అనిత, రాష్ట్ర చేనేత కార్యదర్శి నెమళ్ల.సంజీవ రావు, నగర నాయకులు బొలిశెట్టి. వంశీకృష్ణ, విజయవాడ ప్రధాన కార్యదర్శి నాగేష్, కార్యదర్శి పాల.రజిని, ఆలియా బేగం, సాబిన్కార్.నరేష్, ఇజడ.మురళి, రాఘవరెడ్డి, డివిజన్ నాయకులు పొట్నూరు శ్రీను, రెడ్డిపల్లి గంగాధర్, జనసేన నాయకులు నజీబ్, బావి శెట్టి శ్రీను, పోలిశెట్టి శివ, రామయ్య, తదితరులు పాల్గొన్నారు