తిరుపతి, (జనస్వరం) : తిరుపతి అనే పేరు ఒక చరిత్ర. ‘తిరుమల తిరుపతి’ అనే కవలలు లాంటి కమలమైన పేరును, బాలాజీ జిల్లాగా మార్చడం చాలా బాధాకరం. నార్త్ సైడ్ వారు బాలాజీ అంటారు. మన వైపు వారు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి అని మాత్రమే అంటారని అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని వెనుక ఏదో స్వలాభం ఆశించే పేరు మారుస్తున్నారని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కిరణ్ రాయల్ అన్నారు. దీనిపై జనసేన పార్టీ కూడా తిరుపతినే జిల్లాగా కొనసాగించాలని ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి పేరును మార్చి తిరుపతికి ఉన్న చరిత్ర మార్చవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కిరణ్ రాయల్ పేర్కొన్నారు.