పాకాల, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు గడప గడపకు చేరేలా ముద్రించబడిన 2022 క్యాలండర్ లును జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ. ఎం. నాసీర్ ఆధ్వర్యంలో పాకాల మండలం దామలచెరువు గ్రామంలో ప్రజలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ 2024 లో అధికారంలోకి వస్తే జరిగే మేలును, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాకాల మండల అధ్యక్షులు శ్రీ.గురునాథ్ తలారి, జనసేన నాయకులు శ్రీ. నాగూరు బాషా, చరణ్, షాజహాన్, రహంతుళ్ళ, మస్తాన్, నౌమూన్, చాంద్ బాషా, సుబ్రహ్మణ్యం, చలపతి, అహ్మద్, జనసైనికులు పాల్గొన్నారు.