Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ ప్రభుత్వంలో అల్లాడుతున్న పేద, సామాన్య కుటుంబాలు :- జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

– 2000 పేద సామాన్య కుటుంబాలకు సంక్రాంతి కానుక పంపిణీ.
– జగన్ రెడ్డి పాలనలో సంక్రాంతి పండగ ఎక్కడ..?
– నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుదలతో పిండివంటలకు దూరమైన సామాన్య ప్రజలు.
– సామాజిక వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిని చెప్పుతీసి కొట్టండి.
– టిడ్కో ఇళ్ల గృహప్రవేశం ఎప్పుడు ? సెంటు భూమి అడవుల్లో ఇస్తే తీసుకోవాలా ?
– పండగ చేసుకోవడానికి 2000 లేవు వన్టైమ్ సెటిల్మెంట్ కింద 20,000 ఏవిధంగా చెల్లిస్తారు?
– ప్రభుత్వంపై జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు, నగర పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నల వర్షం
     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ 40వ డివిజన్ అధ్యక్షులు, ఐజా గ్రూప్ చైర్మన్, రజా కమిటీ ప్రెసిడెంట్ షేక్. గయసుద్దిన్ ఆధ్వర్యంలో 2000 పేద సామాన్య కుటుంబాలకు 11 రకాలతో కూడిన నిత్యావసర సరుకుల సంక్రాంతి కానుక కిట్లను భవాని హాస్పిటల్ రోడ్డు నాగార్జున వీధి భవానిపురంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్   పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేద సామాన్య వర్గాలు రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలను ఆనందంతో చేసుకోవాలని మంచి మనసుతో గయసుద్దీన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని కొనియాడారు. ఓటమి తర్వాత కూడా ప్రజలకు నిత్యం సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గయసుద్దీన్ ఉన్నతమైన మనసును తెలియజేస్తుందని, ప్రస్తుత సమాజంలో లబ్ధి పొందేందుకు కులం మతం అంటూ ప్రజలను విడదీస్తూనటువంటి వారిని చెప్పుతీసి కొట్టాలని అన్నారు. భగవంతుడు గయసుద్దిన్ కు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని రాబోయే రోజుల్లో ఉన్నతంగా ఎదిగేందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సీఎం జగన్ రెడ్డి పాలనలో పేద సామాన్య ప్రజల పండగ చేసుకునే వాతావరణం లేదని నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలియజేశారు. పెరిగిన ధరలను నియంత్రించడంలో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఆనందంతోలేరని ఉపాధి ఉద్యోగాల్లేక చేతిలో డబ్బులు లేక కనీసం జత బట్టలు కొనుక్కునే, కేజీ పిండి వంటలు వండుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. టిడ్కో ఇళ్లను తక్షణమే నిర్మాణం పూర్తి చేసి పేద సామాన్య ప్రజలకు అందజేయాలని, సెంటు భూమి విజయవాడ నగర ప్రజలకు అడవుల్లో అందజేశారని, వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని, అదే విధంగా పేద ప్రజలు పండగ చేసుకోవడానికి రెండు వేల రూపాయలు చేతులు లేక అల్లాడుతుంటే వన్టైమ్ సెటిల్మెంట్ పథకం కింద 20 వేల రూపాయలు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఈ అన్ని అంశాలపై అతి తొందర్లోనే జనసేన పార్టీ విజయవాడ తరఫున పేదల పక్షాన న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు. అనంతరం షేక్.గయసుద్దిన్ మాట్లాడుతూ పేద సామాన్య వర్గాలు ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని, 40వ డివిజన్ లో 2000 మందికి ఐజా గ్రూప్ తరపున 11 రకాల నిత్యావసర సరుకుల కిట్ ను సంక్రాంతి కానుక పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే అంతవరకు పోతిన మహేష్ సూచించిన విధంగా పోరాడుతామని ప్రజలకు అండగా నిలబడతామని అధికారపార్టీ అరాచకాలను ఎండగడతామన్నారు. తనకు అండగా నిలబడుతున్న కుటుంబ సభ్యులకు, సోదరులకు, అక్కాచెల్లెళ్లకు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు పేద సామాన్య వర్గాల కోసం చేస్తామని భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్.మున్నా, షేక్.గౌసియా, వీర రెడ్డి, డీ.దుర్గారావు, నాగార్జున, తాజ్ నొత్.మైనర్ బాబు, స్టాలిన్ శంకర్, 41వ డివిజన్ అధ్యక్షులు కూరాకుల సురేష్, 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలాకరుణాకర్, 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి. రమణ, 53వడివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, జనసేన పార్టీ నగర సహాయ కార్యదర్శి గన్ను. శంకర్, బావిశెట్టి శ్రీను, పొలిశెట్టి.శివ, పోతిన.అదిత్, మదన్, రాజు, సాయి, ముంతపురం.రాజేష్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way