Search
Close this search box.
Search
Close this search box.

మహిళా శక్తికి తార్కాణం 2వ రాష్ట్రపతి ” ద్రౌపది ముర్ము “

ద్రౌపది ముర్ము

               రాజకీయ రంగంలో తమదంటూ విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకున్న శక్తి వంతమైన మహిళలు ఎందరో ఉన్నారు, ఎందరినో ప్రభావితం చేయగలిగే ప్రస్థానం కొందరిది. వారిలో ఒకరు నేడు 15 వ రాష్ట్రపతిగా ఎన్నికైనా శ్రీమతి ద్రౌపది ముర్ము దేశంలో మొట్ట మొదటి సారిగా ఒక గిరిజన మహిళ, మహిళల్లో 2 వ రాష్ట్రపతి గా ఎన్నికవ్వటం మహిళా శక్తి ని తెలియచేసే చరిత్రాత్మక ఘట్టం. న స్త్రీ స్వతంత్రమర్హతి అని మనుధర్మం చెప్పినా వంటింటి కుందేలు గా చూస్తున్నా ఎన్నో విజయాలు సాధించి అది తప్పని ఋజువు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఏ రంగమైనా సమర్ధత, అంకిత భావం, చిత్త శుద్ధి, క్రమ శిక్షణ అనే ఉత్యున్నత స్థానానికి ఎదిగేలా చేస్తాయి.
                    ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లా కుసుమీ బ్లాక్‌లో ఊపర్‌బేడా గ్రామంలో జన్మించిన ద్రౌపది ముర్ము వెనుక బడిన ఆదివాసీ గిరిజనుల నుండి విద్యాధికురాలు అవ్వటం వివిధ రంగాలలో ఆమెకు అవకాశాలను తెచ్చి పెట్టాయి. ఆడపిల్లలకు  చదువులెందుకు ,చదివి ఏం చేయగలవు అని హేళన చేసే పరిస్థితులు అధికంగా ఉండే ఆదివాసీల తెగ నుండి డిగ్రీ పూర్తి చేసి ఒక అధ్యాపకురాలిగా మారటం అలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పినట్లయింది. ఒడిశా ఇరిగేషన్, పవర్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ గా కొంతకాలం పనిచేశారు. తర్వాత రాయ్‌రంగ్‌పుర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అధ్యాపకురాలుగా పనిచేస్తూ భాజపా ఎస్‌టీ మోర్చా మెంబర్ చేరటం, భాజపా ఎస్‌టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా, భాజపా మోర్చా సభ్యురాలు (జాతీయ కార్యదర్శి) గా రాజకీయాల్లో తన ప్రయాణం కొనసాగించారు. ఆమె రాజకీయ జీవితానికి తొలి అడుగులు గ్రామ పంచాయితీ కౌన్సిలర్‌గా ఎన్నిక అవ్వటంతోనే మొదలయ్యాయి. తర్వాత రాయ్‌రంగ్‌పుర్ ఎన్‌ఏసీ వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత ఒడిశా అసెంబ్లీకి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, ఒక సారి ఉత్తమ ఎం ఎల్ ఏ గా ఎంపిక అయ్యారు, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ లకు మంత్రిగా పని చేశారు. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా, ఇప్పుడు అశేష భారతావని ప్రధమ పౌరురాలిగా అత్యున్నత పదవిని అధిరోహించారు. ఆమె జీవితంలో విజయాల పరంపర మాత్రమే లేదు గరళాన్ని గుండెల్లో దాచుకుంటూ పెను విషాదాన్ని ఓ వైపు మోస్తూ జీవితం గడిపారు. ఆరేళ్లలో ద్రౌపది ముర్ము తన భర్త, ఇద్దరు కుమారులు, తల్లి, సోదరులు భౌతికంగా దూరం అవటం తీరని విషాదమే. ప్రజా జీవనంతో అనుబంధాన్ని పెంచుకుని అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక చింతన పెంచుకొని బ్రహ్మ కుమారీల సాంగత్యంలో గడుపుతుంటారు.
                     గిరిజన కుటుంబం నుంచి వచ్చి దేశానికి రాష్ట్రపతిగా అత్యున్నత పదవికి చేరుకోవడం నల్లేరు పై నడక కాదు, ఆమె జీవితంలో, రాజకీయంలోఎంతో క్రమశిక్షణ పాటిస్తేనే ఇంతటి స్థానం పొందటం సాధ్యం అయింది. రాష్ట్రపతి పీఠాన్ని అధిరోచించే తొలి ఆదివాసీ మహిళగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము మంత్రిగా, ఝార్ఖండ్​ గవర్నర్​గా సేవలు అందించిన అనుభవంతో, ప్రతీ విషయాన్ని తోతైన అధ్యయనం చేసి, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరున్న ద్రౌపదిముర్ము దేశాధ్యక్షురాలిగా తన దైన ముద్ర తప్పక వేసుకుంటారు. ప్రతీ విషయాన్ని తోతైన అధ్యయనం చేసి, నిర్ణయాలు తీసుకునే ద్రౌపది ముర్ము ఈనెల 25 న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్దించిన 75 ఏళ్లు తర్వాత, ఒక గిరిజన వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎంపిక కావటం, దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన పిన్న వయస్కురాలిగా రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా, రెండవ మహిళా రాష్ట్రపతి గా కూడా ఘనత సాధించారు.

            గ్రామ పంచాయితీ కౌన్సిలర్ గా మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లు అసమానంగా, అజేయంగా దేశంలోనే అత్యున్నత స్థానం అధిరోహించి130 కోట్ల మంది దేశ ప్రజలు “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” జరుపుకుంటున్న వేళ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవికి ఎన్నిక అవటం గర్వ కారణం మహిళలు సాధించలేనిది ఏదీ లేదు అనటానికి ఆమె జీవితమే నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way