మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శివాజీ ఆధ్వర్యంలో మెల్లవాయి పంచాయతీ నుండి పలు గ్రామాల 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం రేపటి భావితరాల భవిష్యత్ కోసం యువకులే నాంది పలకాలని, పల్లె గ్రామాలే ఈ రాష్ట్రానికి పచ్చ తోరణం అని పార్టీ విధివిధానాల గురించి వివరించడం జరిగింది. వాళ్ల మాటలకు ప్రభావితమై జనసేన పార్టీలోకి చేరుతున్నామని యువకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.