పాయకరావుపేట ( జనస్వరం ) : యస్. రాయవరం మండలం పెదఉప్పలం గ్రామంలో మంగళవారం రాత్రి జనసైనికుడు కోట శ్రీనుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. ఈ సంఘటనలో శ్రీను గాయపడి నక్కపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసిన వెంటనే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి ఆదేశాలు మేరకు జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య, తోపాటు మరికొంత మంది నాయకులు బుధవారం నక్కపల్లి ఏరియా ఆసుపత్రికి వెళ్లి శ్రీను ను పరామర్శించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ జనసైనికులపై వైసీపీ వర్గీయులు దాడి చేయడాన్ని ఖండించారు. జనసైనికులకు గెడ్డం బుజ్జి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జగ్గన్నదొర, జ్యోతి కూమార్, సంజయ్, పి. గణేష్, శివ, రంగా తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com