తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వైసిపి నాయకులను కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా హరి ప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ గార్ల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని, ఒక్కరిని చేసి మూకుమ్మడిగా దాడి చేయటం మగతనం కాదని దాడులు చేయటం మాకు కూడా తెలుసు కానీ మా సిద్ధాంతం అది కాదని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర నాయకుడు పగడాల మురళి, సంయుక్త కార్యదర్శి కీర్తన, బత్తిన మధు, హేమ, కోకిల తదితరులు పాల్గొన్నారు.