పాలకొల్లు ( జనస్వరం ) : రాష్ట్రాన్ని తవ్వి పారెయ్యడంలో వాళ్ళు ఉద్దండ పిండాలని జనసేన వీరమహిళ జనసేన రియా అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల్లో వేలాది లారీలు, వందలాది మంది కార్మికులు, పదుల సంఖ్యలో ప్రొక్లైయినర్ల ఇసుక తవ్వకాలు రాత్రింబవళ్ళు కొనసాగుతున్నాయి. లారీలు వెళ్ళేందుకు నదుల్లో ఏకంగా రోడ్లు నిర్మించారంటే అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆగడాలు ఎంత తెగించాయో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నదీ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేయకూడదన్న నిబంధన ఉన్నా, దాన్ని తుంగలో తొక్కి సహజ సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడి ఆకలి అయినా తీరుతుందేమో కానీ అధికార పార్టీ నాయకుల ధన దాహం తీరేటట్లు లేదు. ధన దాహంతో భవిష్యత్‌ను తవ్వేస్తున్నారు. విచ్చలవిడి ఇసుల తవ్వకాలు భావితరాల అవసరాలకు, జల సంక్షోభానికి, పర్యావరణ విఘాతానికి ప్రధాన కారణం కాబోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com