Logo
Date of Publish : 17 February 2024, 9:10 pm
Editor : Sake Naresh

ఇసుక నుండి కాసులు పిండుకుంటున్న వైసీపీ నాయకులు  : జనసేన రియా

    పాలకొల్లు ( జనస్వరం ) : రాష్ట్రాన్ని తవ్వి పారెయ్యడంలో వాళ్ళు ఉద్దండ పిండాలని జనసేన వీరమహిళ జనసేన రియా అన్నారు. ఆమె మాట్లాడుతూ  ఇసుక ర్యాంపుల్లో వేలాది లారీలు, వందలాది మంది కార్మికులు, పదుల సంఖ్యలో ప్రొక్లైయినర్ల ఇసుక తవ్వకాలు రాత్రింబవళ్ళు కొనసాగుతున్నాయి. లారీలు వెళ్ళేందుకు నదుల్లో ఏకంగా రోడ్లు నిర్మించారంటే అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆగడాలు ఎంత తెగించాయో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నదీ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేయకూడదన్న నిబంధన ఉన్నా, దాన్ని తుంగలో తొక్కి సహజ సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడి ఆకలి అయినా తీరుతుందేమో కానీ అధికార పార్టీ నాయకుల ధన దాహం తీరేటట్లు లేదు. ధన దాహంతో భవిష్యత్‌ను తవ్వేస్తున్నారు. విచ్చలవిడి ఇసుల తవ్వకాలు భావితరాల అవసరాలకు, జల సంక్షోభానికి, పర్యావరణ విఘాతానికి ప్రధాన కారణం కాబోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com