Search
Close this search box.
Search
Close this search box.

రాక్షసత్వ పాలనను జనసైనికులు అంతమొందించేరా ? చతికిలపడేరా ??

జనసైనికులు

ఓటమితో నాంది….

              అది 2019 ఓట్ల లెక్కింపు రోజు, సూర్యుడు కళ్ళు తెరవకముందే టీవీలు చప్పుళ్ళు మొదలయ్యాయి. మధ్యాహ్నానికి రాష్ట్ర ప్రజలందరికి క్లారిటీ వచ్చేసింది. సాయంత్రానికి జనసైనుకులకి గుండెల్లో వణుకు మొదలైయింది.. పవన్ కళ్యాణ్  తాను పోటీ చేసిన రెండు స్థానాలలో ప్రత్యర్థుల కుట్రలకి పరాజయం పాలైయ్యాడు… 175 స్థానాలలో ఒక్కటంటే ఒక్క సీట్లో గెలిచింది.

                 ఈ భయంకరమైన భయాలు అన్ని చూడలేక జనసైనికులు తిన్నది గొంతులో దిగక, ఆవిరైన కంఠాలకి పవన్ కళ్యాణ్  ఓటమి తోడైంది… రాత్రి అవ్వనేలేదు అప్పుడే “పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేయ్” “ జనసైనికులు కాదు జనసన్నాసులు” అని హడావిడి. జనసైనికులకి పార్టీ మీద ఆందోళన మొదలైయింది… కానీ వాళ్ళకి అర్ధంకానిది పార్టీ పరిస్థితి కాదు.. వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి? అని… ఎందుకంటే ఆ రోజు గెలిచింది మానవుడు కాదు మృగం. అప్పుడు ఉదయించింది భానుడు కాదు, అధికారం కోసం కాపు కాస్తున్న కీచకుడు…

మరి అలాంటివాడ్ని గెలిపించింది ఎవరు? ?

రావణుడి జైత్రయాత్ర….

          ఈ గెలుపుకి తోడు ఉన్నది ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడికి తోడున్న కృష్ణుడు అనుకుంటే పొరపాటే.. రావణుడికి తోడు ఉన్న కొడుకు ఇంద్రజిత్తులా, వాడికి కూడా పెద్ద అసుర సైన్యం తోడు ఉంది. వాళ్ళ మధ్యలో, అంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జనసైనికులు ఇరుకున పడ్డారు. స్వచ్చందంగా అభిమానించే నాయకుడి గురించే మాట్లాడలేరు. పార్టీ పేరు ఎత్తలేరు, పొరపాటున గొంతు ఎత్తితే అరెస్ట్లు, ప్రశ్నిస్తే “పై” యాత్రకు తయారు. మరి బతికేది ఎలా? ఎలా? సరే, మరి పార్టీ సంగతేంటి? చేతిలో అధికారం లేదు, అన్ని చోట్లా ఓటమి. మరి పార్టీని నడిపించేది ఎలా? దశాబ్దాలు పాలించిన తల్లి కాంగ్రెస్ ఆంధ్రాలో భూ స్థాపితం, 18 సీట్లు వచ్చినదానికే దిక్కు లేదు, 23 సంపాదించినా పార్టీ పరిస్థితే అగమ్యగోచరం… ఒక్క సీట్ లేని పార్టీ సంగతేంటి? మళ్ళీ అధికారం కావాలంటే మరో 5 ఏళ్ళు వేచి చూడాలి … అప్పటి వరకు పార్టీ ఉంటుందా? ఎత్తేస్తుందా???

              ఈ ప్రశ్నలు ఏవీ పవన్ కళ్యాణ్ కు కలలో కూడా బాధించవు… తన ముందు ఉన్న అసలు సిసలైన ప్రశ్న – ” అసురలకి అధిపతి అయిన రావణాసురుడి నుండి తన బిడ్డలాంటి జనసైనికులని కాపాడడం ఎలా? అని. అనుమానం ఉంటే 2019 నుండి ఇప్పటివరకు నమోదు అయిన అత్యాచారాల గణాంకాలు చూస్తే అర్ధం అవుతుంది… ఇలాంటి అసురుల నుండి 5 ఏళ్ళు కాపాడాలి… అది కూడా అధికారం లేకుండా, కేవలం ధైర్యాన్ని విష్ణుమూర్తి చేతిలో శంకు చక్రాలులా మార్చి కాపాడాలి… సాధ్యమేనా?? చూద్దాం… రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. 

 తోడుగామనవాళ్ళు….

                   ఇది ఇలా ఉండగా, రావణుడి దుష్ట పాలన ప్రారంభం అయింది…. జనాలు అన్నీ చూసి అర్ధం చేసుకుంటున్నారు… ఒక పక్క తుగ్లక్ చర్యలు, దానికి అనుగుణంగా కోర్టు మొట్టికాయలు…. అదే ఒక గొప్ప అవకాశం జనసేనకి. వచ్చిన రోజులు మనకోసమే అనుకొని, జనాలలో చైతన్యం నింపి, దీక్షలు, పోరాటాలు చేస్తూ విజయ దారులకి పయనం అవుతున్నారు. విజయం కనపడుతుంది కానీ సింహాసనమే కరువయింది జనసైనికులకి. 

                కరోనా రానే వచ్చింది… బ్రతుకు తన బరువైన పాదాలని ప్రజల మీద భారం వేసి సామాన్యుడి జీవితం కష్టంగా నడుస్తుంది. ఈసారి జనసైనికులకి మరింత బరువు, బాధ్యత రెండు పెరిగాయ్. కరోనా కష్టకాలంలో ఒక మినీ ప్రభుత్వాన్ని నడిపి రోగులకు తగిన రీతిలో సహాయం చేస్తూ ప్రజల నుండే మెప్పు పొంది ” వీళ్లేనా ప్రభుత్వాన్ని పాలిస్తుంది?” అని ప్రజల నుండే మన్ననలు పొందారు. ఈ తుగ్లక్ చర్యలని అడ్డంపెట్టుకొని జనసైనికులు తమ మేధాశక్తిని ఉపయోగించి జనసేన పార్టీకి క్షేత్ర పాలకులుగా వాళ్ళ భుజాలపైన పార్టీని మోస్తూ, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మేధస్సు ఉంటే సరిపోతుందా??? హ హ హ హా … నచ్చిన అభిమాని తెరపైన కనపడగానే చేతి వేళ్ళని విజిల్స్ గా మార్చే కళ ఉంది గాని, ఆ చేతికి కత్తి పట్టి దానికి శత్రువు రక్త ప్రాణాలని తోడుగా తీసుకెళ్లే చేతకాని మంచి పసి మనసులు జనసైనికులు. ఇలాంటి పనులలో ఆ అసురలకి కత్తి, కోడి కత్తి లాంటివి వాడడం కొట్టిన పిండి… ఈ అసురుల బుర్రలకి పదును లేకపోయినా, వాళ్ళు వాడే కత్తికి పదును ఎక్కువ.

ఈ ప్రత్యేక కళని జనసైనికులు ఎదురుకునేది ఎలా ? ప్రశ్నిస్తే కంఠాలు తెగుతున్నాయ్, నిలదీస్తే ప్రాణాలు పోతున్నాయి.

 పుట్టిన శిశువుకి కంటికి రెప్పలా….

              జనసైనికుల వల్ల సమాజానికి మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపే అరాచకం పరుగులు తీస్తుంది. ఎంతటి పవన్ కళ్యాణ్ అయినా, పార్టీ కన్నా తన పసి బిడ్డలే ముఖ్యం కదా! మరి వాళ్ళని కాపాడేదెలా? కాపాడగలడా? లేదా చేతులు ఎతేస్తాడా? చేతులెత్తేసాడు. అసుర అరాచకాలకు తలదించాడు. శిఖరం లాంటి పవన్ కళ్యాణ్ అఫెన్స్ లో ఉండాల్సిన వాడు డిఫెన్స్ లో పడ్డాడు, ఒక పక్క కరోనా విలయతాండవం మరో పక్క జనసైనికుల ప్రాణాలు. రెండు దృష్టిలో పెట్టుకొని, బతకడానికి తావు లేక చచ్చాకైనా వాళ్ళ సొంత కుటుంబాలకి తోడుండే 5 లక్షల భీమా పధకానికి తెర లేపారు… అసుర మూకల రాక్షస చర్యలకి ఏనుగు లాంటి పవన్ కళ్యాణ్ నేలపైన మోకరిల్లాడు, సహాయం అంటే ముందు ఉండే జనసైనికుల చేతులు చిన్నబోయాయి.

               సమస్యలపై ఘీంకరించే కంఠాలు ఇప్పుడు ఆర్తనాదాలకు అలవాటు అయిపోయాయి.  ఇది ఆసలు సిసలైన రావణుడి పాలన, ఇది అసురులు. అనగా బులుగు కుక్కల చిల్లర చేష్టలు, ఇంత వినాశనానికి దారితీసాయి. ఈ పాలన ఇలా ఉండగా, జనసైనికులకి అదృష్టం అనే వరం ఎప్పటికప్పుడు అందుతున్నాయి.. ఇందాక చెప్పినట్టు, రావణుడు కాస్తా తుగ్లక్గా మారాడు. తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం చూస్తుంటే ఆ తుగ్లకే ఈ జగ్లక్ గా పుట్టాడేమో అనిపిస్తుంది. ఉచితాలు అందిస్తున్నా సరే, తీస్కుంటున్న ప్రజలు చీత్కరిస్తున్నారు. ప్రజలలో అసహనం మొదలయింది. కరోనా కన్నా వేగంగా జనాలలో వ్యతిరేకత ఇంకా భయంకరంగా వ్యాపిస్తుంది.  ఈ అసుర సైన్యంలో కూడా, బైటకి చెప్పలేకపోయినా, లోలోపల పళ్ళు కొరుక్కుంటున్నారు. ఈ విషయంలో కొద్దిగా బుద్దిని అయితే ప్రదర్శించారు. కష్ట కాలం లో ఆదుకున్న వాళ్ళని మనిషి అనేవాడు మరిచిపోతాడా చెప్పండి? అదే తనువుగా సమాజంలో చేప కింద నీరులా పారడం మొదలుపెట్టింది జనసేన. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలట్లేదు. ఒక పక్క రావణుడి తుగ్లక్ చర్యలు ఎండగడుతూ మరో పక్క unofficial real time Governance నడిపిస్తూ, ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారారు. జనసైనికులకి అండగా ఉండవలసిన పవన్ కళ్యాణ్ సైతం, జనసేనానికే జనసైనికులు అండగా ఉంటున్నారా అనిపించేలా సాహసోపేతమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రావణుడికి గడ్డు కాలం నడుస్తుందేమో! ఒక పక్క కరోనా మరో పక్క సొంతంగా తుగ్లక్ చర్యలతో తెచ్చిపెట్టుకున్న ఆర్ధిక ఇబ్బందులు మోస్తూ ఉండగానే.. రావణుడికి అండగా ఉండాల్సిన చెల్లి సూర్పనక కూడా దూరం అయింది. మరి గొడ్డు కాలమే కదా రావణుడికి?! అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, తోడుగా కరోనా అనే coupon code free గా సంపాదించుకున్నారు.

            సున్నా సీట్లు వచ్చాయి అని ఆగిపోకుండా, కసితో పనిచేసి, వినశాలని తుడిచేస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు… 2019 ఎన్నికల తర్వాత జనసైనికుల కళ్ళు సముద్రంలా మారాయి, గుండెలు గడ్డకట్టుకున్నాయి… ఆనాడు తెలియని పరిస్థితుల నుండి ఇప్పుడు సమాజానికి వాళ్ళ అవసరం ఎంతో తెలిసేలా చేసాయి… ఒక పక్క అధికార పక్షం 2024 ఎన్నికలకి ఇపుడు నుండే వ్యూహాలు రచిస్తున్నారు. అధికార ప్రతిపక్షం అర్ధం కాని స్థితిలో తలపెట్టుకొని ఉంది. కానీ జనసైనికులు మాత్రం 2024 ఎన్నికల లెక్కల గురించి పక్కన పెట్టి, ప్రజలకోసం సమాజంకోసం వాళ్ళు పడుతున్న శ్రమ నిజంగా నేటి యువతకి, రాజకీయ నాయకులకు స్ఫూర్తి దాయకం. 

#Written By 

@TeamV_2021 (ట్విట్టర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way