
పలాస, (జనస్వరం) : ప్రభుత్వం హూద్ హూద్ తూఫాన్ వల్ల నష్టపోయిన భాదితులకు ఇల్లు మంజూరు చేస్తాం అని పలాస నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర మరియు బెండి పంచాయతీ పరిధిలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. కానీ హూద్ హూద్ తూఫాన్ వచ్చి 7 సంవత్సరాలు అవుతున్న ఇంకా భాదితులుకి ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి అని హరీష్ కుమార్ గారు అన్నారు. హూద్ హూద్ తరువాత తీత్లీ వచ్చి ఇంకా నష్టాన్ని మిగిల్చింది అని గుర్తుచేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అద్దెలు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి పడుతున్నారు అని, వారికి ఇల్లు ఇచ్చివుంటే ఎంతో మేలు చేసి ఉండే వారు అని అన్నారు. అలాగే ఆ పార్టీ ఇచ్చిందా ఈ పార్టీ ఇచ్చిందా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది అని ప్రజలకు తెలుసునని, ఇప్పటికే చేసినా ఆలస్యానికి, మరమత్తులుకి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరము ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని, దీనిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకు వెళ్లి త్వరగా మంజూరు కావడానికి మా జనసేన పార్టీ తరుపున ప్రయత్నం చేస్తాము అని అన్నారు.