
మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గం చిడికాడ మండలంలో అడవి అగ్రహారం గ్రామంలో అగ్ని ప్రమాదములో నష్టపోయిన కోన సింహాచలం, నమ్మి రాములు బాధిత కుటుంబాలకు జనసేన నేతలు ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలకు వాకపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ 25kgల బియ్యం, 5000 రూపాయలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రొబ్బా మహేష్, గండెం రాంబాబులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.