చంద్రుడిపై ప్రయోగాల నేపథ్యంలో అక్కడి వనరుల హక్కులపై ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 1966లో ఐరాస ఔటర్ స్పేస్ ట్రీటీ తీసుకొచ్చింది. దీని ప్రకారం అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి. 1979లో మూన్ అగ్రిమెంట్ ప్రకారం చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అయితే, 1984లో ఇది అమల్లోకి రాగా అమెరికా, రష్యా, చైనా దీనికి ఆమోదం తెలపలేదు. 2020లో అర్టెమిస్ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా, చందమామపై సురక్షిత ప్రయోగాలే దీని ఉద్దేశం.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com