ప్రతి ఒక్క ఓటు భారత పౌరుడి ధర్మ ఆయుధం. ఓటు అనే బ్రహ్మస్తంతో శాసించగలిగే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. జాతి, మత, ప్రాంత, బేధాలు లేకుండా ప్రతి ఒక్క పౌరులకు భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓటు రూపంలో ప్రజలకు మేలుచేసే సమర్ధులనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనే గొప్ప అవకాశాన్ని రాజ్యంగం కల్పించింది. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా పవిత్రమైనది. ప్రతి ఓటు శాస్త్ర సమ్మతమైన సమాజాభివృద్ధికి మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు నీ ఓటు గొప్ప ఆయుధం. ఓటు హక్కు మన జన్మ హక్కు అని ప్రతి ఒక్కరు స్పష్టంగా తెలుసుకోవాలి.
ఓటుకు నోటు – నోటుకు ఓటు :
ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితి, ఓటుకు నోటు తీసుకొని అభ్యర్థి నీచుడైన కోట్ల రూపాయిలు డబ్బు ఉంటే చాలు. ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఓటు కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. నోటుకు నోరెళ్ళబెట్టుకొని ఓటు వేసి నోరుమెదపలేని పరిస్థితుల్లో కృంగిపోతున్నాము. నోటు అనే నాణ్యాన్ని ప్రజలకు పంచి, బలహీనపరిచి, గెలుపును పటిష్ఠం చేసుకొంటున్నారు. కొన్ని పార్టీలు నోటుని నినాదంగా ఏర్పరచుకొని, ఓటుని వాళ్ళకి అనుగుణంగా మార్చుకొనే స్థితిలో కొంత మంది ప్రజాప్రతినిధులు మన ప్రజాస్వామ్యంలో ఉన్నారు. నోటుకు ఓటు వేసి ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాము. ఓటుకు నోటు తీసుకొని అర్హతలేని వాళ్ళని గెలిపించడం న్యాయమా ? డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి, కుళ్లు రాజకీయాలను ప్రోత్సహించడం ధర్మమా? ఓటుకు నోటు ఇస్తే పాలకుడు నేరస్తుడైన, కామాంధుడైనా నాయకునిగా ఎన్నుకుంటే, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం గురించి ఏం ఎరుకా…. వాంఛ, ద్రోహం, వెన్నుపోటు రాజకీయాలను అణిచివేయాలంటే నీ ఓటు హక్కుని, నోటుకు లొంగి నీచులకి కాకుండా నిజమైన పాలకుడికి ఓటు వేసి గెల్పించుకో. ప్రజలను పాలించే ప్రజానాయకుడిని ఎన్నుకో. అనగా ఒక వ్యవస్థ నిర్మించడానికైనా, కూల్చడానికైనా సామాన్య ప్రజానీకంలో ఉన్న ఏకైక ఆయుధం ‘ఓటు హక్కు’.
ధన బలం, అధికార బలంతో పరిపాలనను హస్తగతం చేసుకొని, చట్టసభల్లో వెళ్లి ప్రగతిశీల చట్టాలకు పాతరేసి భారత రాజ్యాంగంను సంక్షోభంలోకి నెట్టడం జరుగుతుంది. వీళ్ళ దాహానికి ధనిక, పేద ప్రజలు దరిద్రములోనే కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని రాజకీయ నేతలు డబ్బుని ఎరగా వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. దౌర్భాగ్య౦… దీనికి ముల కారణం ఓటుకు నోటు తీసుకొని నీచున్ని నాయకుడిగా, పాలకుడిగా ఎన్నుకోవడం. కులము, మతము, వర్గం అనే తారతామ్యాలతో ప్రజలు కృంగిపోతున్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కొలమానం. తమ ఆకాంక్షలను నెరవేర్చని ప్రభుత్వాలను ఓడించే హక్కు రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. ” ఓటు హక్కు నోటు హక్కుగా “ అనుకొని మూర్ఖుడుని ప్రజానాయకుడిగా ముందజలో నిలబెట్టకు. నాయకుడు నలుగురిలో మెలగాలి గానీ నందనవంలో కాదు.
నోటుకు లొంగకు – ఓటును మింగకు :
భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం నీ వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతంగా సమాజం కోసం ఆలోచించే నాయకున్ని ఎన్నుకో. ఓటు హక్కు పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యానికి దిక్సూచి ఓటు వినియోగించుకోవటం ప్రధాన కర్తవ్యం. ప్రతి మనిషి తమ కర్తవ్యాన్ని గుర్తిస్తే , మార్పు మొదలు. పూర్వ చరిత్రను పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. ఓటు వేయడం అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ద్వారా సంక్రమించింది. ఓటరు నిర్భయంగా, ప్రశాంతంగా, ఏకాంతంగా నోటుకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజ్యంగాన్ని గౌరవిస్తూ ఓటు హక్కునీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఓటు హక్కును నిర్భయంగా, నిజాయితీగా పొందుపర్చాలి.
“ఓటు హక్కు మన జన్మ హక్కు “
written by
ట్విట్టర్ : @gounder_ramya